Tecno Pova 8 Launched: స్మార్ట్ ఫోన్ తయారీదారు టెక్నో (Tecno) నుండి కొత్తగా పోవా 8 (Pova 8) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో గురువారం అధికారికంగా విడుదల చేసింది. ఇందులో 6.76 అంగుళాల Full HD+ IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 1,080×2,344 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 950 నిట్స్ బ్రైట్‌నెస్, 1500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.
అలాగే ఈ ఫోన్‌లో 6nm టెక్నాలజీ ఆధారిత MediaTek Dimensity 7100 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను అమర్చారు. Mali-G610 MC2 GPUతో జత చేసిన ఈ ప్రాసెసర్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు మెరుగైన పనితీరును అందిస్తుంది. ఫోన్ 6GB, 8GB LPDDR5x RAM ఆప్షన్లతో పాటు 128GB, 256GB UFS 2.2 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఫోటోగ్రఫీ కోసం.. 50 MP సోనీ LYT-600 ప్రధాన కెమెరాను అందించారు. దీనికి లైట్ సెన్సర్ కూడా జత చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 13 MP కెమెరా ఉంది. వీటితోపాటు అనేక AI ఫీచర్లు కెమెరా సెటప్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేకంగా Alive Matrix డిస్ప్లేను అందించారు. వివిధ యాప్‌ల నుంచి వచ్చే నోటిఫికేషన్లు, అలర్ట్‌లను కస్టమైజ్ చేసుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దీంతో ఫోన్‌కు ప్రత్యేకమైన డిజైన్ లుక్ లభిస్తుంది. ఈ మొబైల్ లో చెప్పుకోవాల్సింది 8000mAh భారీ బ్యాటరీ. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 39 గంటల వరకు కాలింగ్, దాదాపు 18 గంటల వీడియో ప్లేబ్యాక్, 1,198 గంటల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 14,689 చదరపు మిల్లీమీటర్ల కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. అలాగే MIL-STD-810H సర్టిఫికేషన్, IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. భారత మార్కెట్లో Tecno Pova 8 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా నిర్ణయించారు. అలాగే 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.31,999. 16 బిట్ వైట్, ప్లాస్మా ఆరంజ్, టెర్మినల్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
POVA 8. Say hello to Peak Design.
You can have it all:
➡️ 8000mAh* Super Power
➡️ 45W Fast Charge
➡️ 50MP Sony LYTIA 600 Camera
➡️ 2X Optical Zoom With 2K Recording
➡️ Triple Chipset With 20 5G BandsSale starts 18 June, 12 Noon. On Flipkart and at retail stores near you.… pic.twitter.com/3x60OMs19F
— POVA Mobile India (@pova_mobile) June 11, 2026

