NTV Telugu Site icon

Technology: Realme R100 స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ

R100000

R100000

మార్కెట్లోకి రకరకాల స్మార్ట్ వాచ్‌ లు వచ్చిపడుతున్నాయి. యువత మెచ్చేలా రియల్ మీ సంస్థ ఆర్ 100 స్మార్ట్ వాచ్ విడుదలచేయడానికి రంగం సిద్ధమయింది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూ టూత్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ వాచ్ నుంచి కాల్స్ కూడా చేసుకోవచ్చు.

ఈ ఆర్ 100 స్మార్ట్ వాచ్ ఎప్పుడు విడుదల చేసేది కూడా రివీల్ చేసింది. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12.30 కి వాచ్ విడుదల కానుంది. రియల్ మీ సంస్థ ఇప్పటికే టెక్ లైఫ్ ఎస్ 100, ఎస్ జెడ్ 100 స్మార్ట్ వాచ్‌ లను ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదలచేసింది. ఈ స్మార్ట్ వాచ్‌ ల ద్వారా యువతను బాగా ఆకట్టుకుంది.

ఆర్ 100 స్మార్ట్ వాచ్

రియల్ మీ ఆర్ 100 స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్

*1.32 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్ సీడీ లార్జ్ కలర్ డిస్ ప్లే
* బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్
*మంచి బ్యాటరీ లైఫ్
* రెండు ఆకర్షణీయమయిన రంగులు
* ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి
* అల్యూమినియం అల్లాయ్
* 360 X 360 పిక్సెల్స్ రిజల్యూషన్
* బ్లాక్ మరియు క్రీం కలర్స్
*ఆర్ 100 బ్యాటరీ కెపాసిటీ 380 mah
* ఒకసారి ఛార్జ్ చేస్తే ఏడురోజుల పాటు పనిచేసే బ్యాటరీ
* 24X7 హార్ట్ బీట్ మోనిటరింగ్
* స్కిన్ టెంపరేచర్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్
* ఈ మోడల్ ధర రూ.2499 వుండవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి ఈ స్మార్ట్ వాచ్ బాగుంటుంది.

Technolgy: iQoo Neo 6 స్మార్ట్ ఫోన్‌