Site icon NTV Telugu

త్వరలో Poco X8 Pro Series విడుదల.. ధరలు, కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ వేరియంట్లు లీక్

Poco

Poco

Poco X8 Pro Series: షియోమీ సబ్-బ్రాండ్ పోకో నుంచి రాబోయే Poco X8 Pro, Poco X8 Pro Max స్మార్ట్‌ఫోన్లు త్వరలోనే గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు భారత్, సింగపూర్‌కు సంబంధించిన పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో దర్శనమివ్వగా, తాజాగా యూరప్‌లోని ఒక దేశానికి చెందిన Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా దర్శనమిచ్చాయి. దీంతో వీటి ధరలు, కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ వేరియంట్లపై ఓ క్లారిటీ వచ్చింది.

Read Also: Minister Kandula Durgesh: పవన్ కల్యాణ్‌ ఆలోచన మేరకు ఏకో టూరిజం అభివృద్ధి.. సినిమా టూరిజం డెవలప్‌మెంట్‌పై ఫోకస్‌..

ధరలు, కలర్ ఆప్షన్లు:
బెల్జియంలోని Xiaomi België వెబ్‌సైట్‌లో కనిపించి, తర్వాత తొలగించిన ల్యాండింగ్ పేజ్ ప్రకారం ఈ రెండు ఫోన్లు బ్లాక్, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.

Poco X8 Pro Max
* 12GB RAM + 256GB స్టోరేజ్: EUR 529 (సుమారు ₹57,000)
* 12GB RAM + 512GB స్టోరేజ్: EUR 579 (సుమారు ₹62,000)

Poco X8 Pro
* 8GB RAM + 256GB స్టోరేజ్: EUR 399 (సుమారు ₹43,000)
* 8GB RAM + 512GB స్టోరేజ్: EUR 449 (సుమారు ₹48,000)
* 12GB RAM + 512GB స్టోరేజ్: EUR 479 (సుమారు ₹51,000)

Read Also: India-US Trade Deal: భారత్ మ్యాప్‌ విడుదల చేసిన అమెరికా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ సందేశం

డిజైన్, లుక్:
* వెనుక భాగంలో పిల్-షేప్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
* ముందు వైపు హోల్-పంచ్ డిస్‌ప్లే
* ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్
* కుడి వైపు పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్
* ఫ్రేమ్ రెండు వైపులా యాంటెనా బ్యాండ్స్

ప్రాసెసర్:
Poco X8 Pro- MediaTek Dimensity 8500 చిప్‌సెట్
Poco X8 Pro Max- కొత్తగా విడుదలైన MediaTek Dimensity 9500s SoC

లాంచ్ ఎప్పుడు?:
అయితే, ఈ రెండు ఫోన్లు ఇప్పటికే పలు సర్టిఫికేషన్ డేటాబేస్‌లలో కనిపించడం, యూరప్ స్టోర్ లిస్టింగ్ బయటపడటంతో త్వరలోనే గ్లోబల్ లాంచ్ జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు మరిన్ని వివరాల కోసం ఎదురు చూడాల్సిందే.

Exit mobile version