ఇక థియేటర్స్ ఎందుకు దండగా.. TCL Ultra HD (4K) LED 75 అంగుళాల టీవీ ఉండగా! రూ. 1,30,000 కు పైగా డిస్కౌంట్..

  • TCL నుంచి వచ్చిన 75 అంగుళాల భారీ స్క్రీన్ గల స్మార్ట్ టీవీ.
  • గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ సపోర్ట్.
  • MRP 1,99,990 కాగా ప్రస్తుతం ప్రత్యేక ఆఫర్ ధర 65,990.
Tcl

Tcl

TCL Ultra HD (4K) LED 75 TV: TCL సంస్థ నుంచి వచ్చిన 75 అంగుళాల భారీ సైజ్ గల V6C సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ గూగుల్ టీవీ ఇంటి వినోదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. పెద్ద స్క్రీన్, ఆధునిక స్మార్ట్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో ఈ టీవీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ చూసేందుకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. టీవీలు ఇప్పుడు ఇంటి హోమ్ ఎంటర్టైన్మెంట్ ‎సిస్టమ్‌లో కీలక భాగం అయ్యాయి, పెద్ద స్క్రీన్, డిజిటల్ స్మార్ట్ ఫీచర్లు మరియు HDR విజువల్ క్వాలిటీ అందుబాటులో ఉన్నప్పుడు సినిమా-మెరిన అనుభవం మన ఇంట్లోనే లభిస్తున్నాయి. ఇవే లక్షణాలు కలిగి ఉంది TCL V6C 189 cm (75 inch) Ultra HD (4K) LED Smart Google టీవీ.

WI vs Zimbabwe: జింబాబ్వే బౌలర్లకు ‘రక్తకన్నీరు’.. సిక్సర్లతో విరుచపడ్డ విండిస్ బ్యాటర్లు!

భారీ 75 అంగుళాల 4K అల్ట్రా HD డిస్‌ప్లే:
ఈ టీవీలో 75 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో 4K Ultra HD (3840 × 2160 pixels) రిజల్యూషన్ అందుబాటులో ఉంది. దీని వల్ల చిత్రాలు చాలా క్లియర్‌గా, సహజ రంగులతో కనిపిస్తాయి. పెద్ద స్క్రీన్ కారణంగా హోమ్ థియేటర్ అనుభవం పొందవచ్చు. TCL టీవీలు అధిక బ్రైట్‌నెస్, మెరుగైన కాంట్రాస్ట్, జీవం ఉన్న రంగులతో సినీమాటిక్ విజువల్ అనుభవాన్ని అందించేలా ఉన్నాయి.

గూగుల్ టీవీ & స్మార్ట్ ఫీచర్లు:
ఈ టీవీ గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. యూట్యూబ్, నెట్ఫ్లిక్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్ వంటి ప్రముఖ OTT యాప్స్‌ను నేరుగా ఉపయోగించవచ్చు. వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ ఫీచర్‌తో మొబైల్‌లోని వీడియోలు, ఫోటోలు, కంటెంట్‌ను టీవీపై సులభంగా చూడవచ్చు.

WhatsApp Supreme Court Case: సుప్రీంకోర్టులో యూ-టర్న్‌ తీసుకున్న వాట్సాప్..

ప్రీమియం డిజైన్ & సౌండ్ క్వాలిటీ:
మెటాలిక్ డిజైన్‌తో ఈ టీవీ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్లిమ్ బెజెల్స్ వల్ల స్క్రీన్ స్పేస్ ఎక్కువగా కనిపిస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో శబ్దం కూడా స్పష్టంగా, థియేటర్ తరహాలో వినిపిస్తుంది. ఇది సినిమాలు, స్పోర్ట్స్, గేమింగ్‌కు సరైన ఎంపికగా నిలుస్తుంది.

కనెక్టివిటీ & ఫీచర్లు:
ఈ టీవీలో HDMI, USB, Wi-Fi, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా గేమింగ్ కన్సోల్, సెట్‌టాప్ బాక్స్, పెన్ డ్రైవ్ వంటి పరికరాలను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ రిమోట్‌తో వాయిస్ కమాండ్స్ ఉపయోగించి టీవీని నియంత్రించవచ్చు.

Tamil Nadu: SIR చిచ్చు.. 74 లక్షల ఓటర్లు తొలగింపు.. ఫైనల్ లిస్ట్ రిలీజ్!

ధర డిస్కౌంట్:
ఈ TCL 75-అంగుళాల 4K స్మార్ట్ గూగుల్ టీవీ MRP ధర రూ. 1,99,990 కాగా.. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌తో కేవలం రూ. 65,990 ధరకు అందుబాటులో ఉంది, ఇది భారీ స్క్రీన్ టీవీ కోసం మంచి ఆఫర్‌గా చెప్పవచ్చు.