ఫోన్లకు మనకు అవసమైన కాల్స్ వస్తాయో లేదో కానీ స్పామ్ కాల్స్ మాత్రం గంటకు నాలుగు ఐదు కాల్స్ వస్తాయి.. ఎంత బిజీగా ఉన్న ఈ ఫోన్ కాక్స్ విసిగిస్తూనే ఉంటాయి.. వీటికి ఎంతగా బ్లాక్ చేసినా మళ్లీ మళ్లీ కొత్త నెంబర్స్ నుంచి వస్తూనే ఉంటాయి.. లోన్ తీసుకుంటారా.. కొత్త స్కూటీ కొంటారా.. అది ఇది అని కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి.. కొంతమంది విసుగు వచ్చి ఫోన్ ను పక్కనే పడేస్తుంటారు.. దిగులు పడకండి అలాంటి వారికోసం సింపుల్ టిప్స్.. ఇలాంటి చేస్తే ఇక అలాంటి కాల్స్ కు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఒక్కసారి చూసేద్దాం..
మెసేజ్ ల ద్వారా వీటికి చెక్ పెట్టవచ్చు.. ఎలాగంటే? ఫోన్‌లోని మెసేజ్ ఓపెన్ చేసి. 1909 నెంబర్‌కి ‘బ్లాక్’ అనే మెసేజ్ పంపించాలి. వెంటనే మీకు మరో మెసేజ్ వస్తుంది. అందులో మీ పర్సనల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి, ఎలాంటి రకం కాల్స్ వద్దనుకుంటున్నారో సమాచారం అందించాలి. దీంతో 24 గంటల్లో స్పామ్ కాల్స్ నిలిపివేస్తారు..
ఇక మీరు వోడాఫోన్ కస్టమర్ అయితే.. ముందుగా Discover.vodafone.in/dndకి వెళ్లాలి. అనంతరం మొబైల్ నంబర్, ఈ మెయిల్ ID, పేరును ఎంటర్ చేయాలి. తర్వాత మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న క్యాటగిరీలను సెలక్ట్ చేసుకొని ఓకే బటన్ ను క్లిక్ చేస్తే చాలు వీటి బెడద ఉండదు..
అదే విధంగా మీరు జియో యూజర్లు స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ఓ ఆప్షన్‌ను అందించింది. ఇందుకోసం ముందుగా ‘మై జియో’ యాప్‌ని ఫోన్‌ల ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం సర్వీస్ సెట్టింగ్‌లో డోంట్ డిస్బర్బ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో ఈ క్యాటగిరీలో మీరు డీఎన్‌డీ సర్వీస్‌ను ఎందుకు యాక్టివేట్ చెయ్యాలనుకుంటున్నారో తెలిపాలి.. వెంటనే కాల్స్ బ్లాక్ అవుతాయి..
ఎయిరల్ యూజర్లు అయితే.. ముందుగా airtel.in/airtel-dndకి వెళ్లాలి. అనంతరం వెబ్‌సైట్‌లో ముందుగా మీ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం మీ ఫోన్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే మీరు బ్లాక్ చేయాలనుకున్న క్యాటగిరీలను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది..
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోన్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్‌పై క్లిక్ చేస్తే కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ ఫోన్‌లో యాక్టివేట్ అవుతుంది.. ఆ తర్వాత మీకు ఈ కాల్స్ రానే రావు.. ఈ టిప్స్ ను ఒకసారి ట్రై చేసి చూడండి..