Samsung Galaxy A17 5G: మిడ్రేంజ్లో మాస్ అట్రాక్షన్.. స్టైల్, స్పీడ్, స్మార్ట్‌నెస్ అన్నీ కలిపి శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్!
- Samsung Galaxy A17 5G లాంచ్.
- 6.7-అంగుళాల Super AMOLED ఫుల్ HD+ డిస్ప్లే
- IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్
- 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్ 13MP సెల్ఫీ కెమెరా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy A17 5G: శాంసంగ్ (Samsung) తాజాగా తన గాలక్సీ A సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే Samsung Galaxy A17 5G. ఇది గతంలో వచ్చిన Galaxy A16 5Gకి అప్డేటెడ్ వర్షన్. సరికొత్త ఫీచర్లు, మంచి ప్రాసెసర్ పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌తో యూజర్లను ఆకట్టుకునేలా ఈ ఫోన్ ను రూపొందించారు. మరి ఈ కొత్త మొబైల్ విశేషాలను ఒకసారి చూసేద్దామా..
డిజైన్ అండ్ డిస్‌ప్లే విషయానికొస్తే.. Galaxy A17 5G 6.7-అంగుళాల Super AMOLED ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో విజువల్స్ మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. Infinity-U కట్‌తో ఉన్న డిస్‌ప్లే, యూజర్‌కు మంచి వీక్షించే అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌కు IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. అంటే ఇది కొంతమేరకు నీటి చుక్కలు పడ్డా, దుమ్ము నుండి కూడా రక్షణ కల్పిస్తుంది.
Also Read
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
- iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
- Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
Motorola: గ్లామర్ టచ్ తీసుకొస్తున్న మోటరోలా.. కొత్త బ్రిలియంట్ ఎడిషన్ అనౌన్స్!

ప్రాసెసర్ అండ్ సాఫ్ట్‌వేర్ విషయంలో ఇది 5nm ఆధారిత Exynos 1330 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తోంది. ఇది Mali-G68 MP2 GPUతో జతచేయబడి ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7తో రన్ అవుతుంది. ర్యామ్ పరంగా ఈ మొబైల్ 4GB, 6GB, 8GB వేరియంట్లలో లభించనుండగా.. స్టోరేజ్ 128GB, 256GBగా అందుబాటులో ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఫోటో ప్రియుల కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇందులో అందించబడింది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8 అపీచర్, ఆटोఫోకస్‌తో), 2MP మ్యాక్రో లెన్స్ (f/2.2) ఉన్నాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా (f/2.0) ఉంది. ఇది వీడియో కాల్స్, సెల్ఫీలకు అనుకూలంగా డిజైన్ చేయబడింది.

బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయంలో, Galaxy A17 5G లో 5,000mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతిస్తుంది. దీని వల్ల రోజువారీ పనులకు నిరంతర వినియోగం సాధ్యమవుతుంది.
Trupm-Putin: వచ్చే వారం ట్రంప్-పుతిన్ ప్రత్యక్ష భేటీ.. జెలెన్‌స్కీ కూడా హాజరయ్యే ఛాన్స్
ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5, Bluetooth 5.3, USB Type-C పోర్ట్ ఉన్నాయి. ఈ మొబైల్ పరిమాణం 164.4 x 77.9 x 7.5mm కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.
ధర విషయానికి వస్తే.. యూరప్ మార్కెట్‌లో దీని ప్రారంభ ధర 239 యూరోస్ (సుమారు 24,000) గా ఉంది. ఇది బ్లాక్, బ్లూ, గ్రే రంగుల్లో శాంసంగ్ స్టోర్ లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. భారత మార్కెట్‌కు సంబంధించి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
మొత్తంగా, Galaxy A17 5G మిడ్రేంజ్‌లో స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఫీచర్లు, మల్టీటాస్కింగ్ సామర్థ్యంతో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది.
తాజావార్తలు
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
-
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!