Samsung Galaxy S24 Series : మార్కెట్ లోకి శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్..సూపర్ ఫీచర్లు, ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్లను తీసుకురాబోతుంది.. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది. కంపెనీ స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా అనే మొత్తం మూడు మోడళ్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తుంది..ఒక్కో ఫోన్ కు ఫీచర్లను బట్టి ధర కూడా వేరేగా ఉంటుంది.. మూడింటిలో అత్యంత ప్రీమియం వేరియంట్ అల్ట్రా మోడల్ క్వాల్‌కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తోంది. ఇతర మోడల్‌లు ఎక్సినోస్ ఎస్ఓసీని కలిగి ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ధర,ఫీచర్స్ ను ఒక్కసారి చూద్దాం..
ఫీచర్ల విషయానికోస్తే.. గెలాక్సీ ఎస్24 6.2-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ స్క్రీన్‌ను 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. శాంసంగ్ ఇంటర్నల్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 256జీబీ వరకు స్టోరేజీ ఆప్షన్ల ద్వారా సపోర్టు ఇస్తుంది.. అలాగే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 30ఎక్స్ డిజిటల్ జూమ్‌తో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10ఎంపీ టెలిఫోటో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. చివరకు హుడ్ కింద పెద్ద 4,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది..
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
గెలాక్సీ ఎస్24+..6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో 1హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డివైజ్ ప్రామాణిక మోడల్ మాదిరిగా ఎక్సినోస్ 2400 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 512జీబీ స్టోరేజీ ఆప్షన్లతో అందిస్తోంది.4,900ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది..
గెలాక్సీ ఎస్24 అల్ట్రా.. 6.8-అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 12జీబీ ర్యామ్‌తో గరిష్టంగా 1టీబీ స్టోరేజీ ఆప్షన్ల ద్వారా బ్యాకప్ పొందవచ్చు.. 200ఎంపీ ప్రైమరీ కెమెరాతో సహా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ కెమెరా యూనిట్‌లో 12ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 10ఎంపీ టెలిఫోటో సెన్సార్ కూడా ఉన్నాయి.. ఇక హుడ్ కింద పెద్ద 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది..
ఇక చివరగా ఈ మూడింటి ధర విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర 799.99 డాలర్లు ( రూ. 66,538), అయితే గెలాక్సీ ఎస్24+ మోడల్ ధర 999.99 డాలర్లు ( రూ. 83,173). గెలాక్సీ ఎస్24 అల్ట్రా 1,299.99 డాలర్లు ( రూ. 1,08,125) వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.. ఇక ఇండియాలో త్వరలోనే సేల్స్ ప్రారంభం కానున్నాయి..
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?