వీగన్ లెదర్ బ్యాక్, 50MP రియల్ కెమెరాతో రూ.15 వేలలోపే Samsung Galaxy F70e
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ తన కొత్త Galaxy F70 సిరీస్‌ను భారత మార్కెట్లో త్వరలో విడుదల చేయనుందని అధికారికంగా ధృవీకరించింది. ఈ సిరీస్‌లో భాగంగా రాబోతున్న Samsung Galaxy F70e స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 లోపే ఉండనుందని లీకులు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ Flipkart మరియు Samsung India ఆన్లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. శామ్సంగ్ ఇంకా అధికారిక లాంచ్ తేదీ, మోడళ్ల పేర్లను ప్రకటించనప్పటికీ, Galaxy F70 సిరీస్‌లో ఒక మిడ్-రేంజ్ ఫోన్‌తో పాటు ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఉండనున్నట్లు టీజ్ చేసింది. తాజాగా ఆన్లైన్లో కనిపించిన రెండర్ల ప్రకారం Galaxy F70e డిజైన్, కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.
డిజైన్ & డిస్ప్లే
Samsung Galaxy F70e వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో ఆకర్షణీయంగా కనిపించనుంది. ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ ఉండగా, చుట్టూ కొద్దిగా మందపాటి బెజెల్స్ కనిపించనున్నాయి. కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కీలు ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ కనీసం నలుపు రంగు ఆప్షన్లో అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.7 అంగుళాల HD+ డిస్ప్లే ఉండగా, 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు లభించనుంది. ప్రాసెసర్ & స్టోరేజ్ విషయానికి వస్తే.. Galaxy F70e స్మార్ట్‌ఫోన్‌కు MediaTek Dimensity 6300 చిప్సెట్ శక్తినిస్తుందని తెలుస్తోంది. ఇది.. 6GB వరకు RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులోకి రావచ్చు. అదనంగా మైక్రో SD కార్డ్ మద్దతు కూడా ఉండే అవకాశం ఉంది.
Also Read
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
కెమెరా ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం Galaxy F70eలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా.. 2MP సెకండరీ కెమెరా ఉండనున్నాయి.. మొత్తంగా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా అందించనున్నారు. మరోవైపు.. ఈ ఫోన్లో 6,000mAh బ్యాటరీ ఉండగా, 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు లభించనుంది. Galaxy F70e Android 16 ఆధారిత Samsung One UI 8పై పనిచేస్తుందని సమాచారం. ఇక, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP54 రేటింగ్ (దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ) కూడా అందించనుంది.. మరోవైపు.. లీకుల ప్రకారం, Samsung Galaxy F70e ధర రూ.10,000 – రూ.15,000 మధ్య ఉండే అవకాశం ఉంది. అదే సిరీస్‌లో మరో మోడల్ ధర రూ.30,000 లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.. బడ్జెట్ ధరలో ప్రీమియం డిజైన్, పెద్ద బ్యాటరీ, 50MP కెమెరా వంటి ఫీచర్లతో Galaxy F70e మార్కెట్లో మంచి పోటీ ఇవ్వనుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!