Samsung Galaxy A27 5G: 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 2032 వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామ్ సంగ్ గెలాక్సీ A సిరీస్‌లో మరో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది గెలాక్సీ A సిరీస్‌లో వచ్చిన ఫోన్లలో ఇదే అత్యంత సరసమైన మోడల్‌గా నిలిచింది. ముఖ్యంగా, ఈ ఫోన్‌కు 2032 వరకు సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని కంపెనీ ప్రకటించడం విశేషం. సామ్ సంగ్ గెలాక్సీ A27 5G పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం చెక్ రిపబ్లిక్లో విడుదల చేశారు. అయితే, దీని అధికారిక ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే భారత మార్కెట్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
Samsung Galaxy A27 5G ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ AMOLED ఇన్ఫినిటీ-O డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను అందించే ఈ డిస్ప్లే వినియోగదారులకు మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. ఫోన్ పక్క భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. పనితీరు విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 6GB/8GB LPDDR5X ర్యామ్, 128GB/256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రో SD కార్డ్ సాయంతో స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్‌ను కూడా కంపెనీ అందించింది.
Also Read
- 200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
- Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
- China Robot: చైనా రోబోలు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
- iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
50MP కెమెరా, OIS సపోర్ట్
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 5MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
2MP మాక్రో కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
బ్యాటరీ, సాఫ్ట్వేర్
Samsung Galaxy A27 5Gలో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UIపై పనిచేస్తుంది. వినియోగదారులకు ఆరు సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని సామ్ సంగ్ హామీ ఇచ్చింది. అంటే ఈ ఫోన్‌కు 2032 వరకు అప్డేట్లు అందుబాటులో ఉండనున్నాయి. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్‌కు IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.
ధర ఎంత?
Samsung Galaxy A27 5G నీలం, నలుపు, లేత గులాబీ, లేత ఆకుపచ్చ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ధరను అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇది రూ.30,000 లోపు ధర శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ అందిస్తుంది.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 2032 వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీ!
-
Shubman Gill: గుర్బాజ్ గుబులు పెట్టాడు.. కానీ మా కుర్రాళ్లు అద్భుతం చేశారు!
-
Thalapathy Vijay : తలపతి బర్త్ డే ట్రీట్ ‘జన నాయగన్’ కాదు… సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
-
OTT Movies : ఓటీటీలో సందడి చేస్తోన్న హిట్ మూవీస్
-
Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!