Samsung Galaxy A07 5G: బడ్జెట్ ధరలో 5G సపోర్ట్‌తో పాటు పెద్ద బ్యాటరీ ఉన్న ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ సిరీస్ అయిన Galaxy A సిరీస్ లో మరో పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధమవుతోంది. తాజా లీక్‌ల ప్రకారం శాంసంగ్ గాలక్సీ A07 5G (Samsung Galaxy A07 5G) స్మార్ట్‌ఫోన్‌ను 6000mAh భారీ బ్యాటరీతో విడుదల చేయనున్నారు.
ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Samsung Galaxy A07 4G (5000mAh బ్యాటరీ) మోడల్‌తో పోలిస్తే పెద్ద అప్‌గ్రేడ్. 2025లో Samsung Galaxy A07 4G మోడల్ శాంసంగ్ కు అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించడం.. అంటే “వాల్యూ ఫర్ మనీ” ఫార్ములా. ఇప్పటికే Galaxy A07 4G మోడల్ ఒక పూర్తి రోజు బ్యాటరీ బ్యాకప్ ఇస్తోంది. కాబట్టి కొత్త 5G మోడల్లో అదనంగా 1000mAh బ్యాటరీ ఉండటం వల్ల, ఇది మరింత ఆకర్షణీయంగా మారడం ఖాయం.
లీక్ సమాచారం ప్రకారం Samsung Galaxy A07 5Gలో ఉండే ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్లో MediaTek Dimensity 6300 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించవచ్చని సమాచారం. ఇందులో 5G సపోర్ట్ రావడం వల్ల ఫోన్ వినియోగంలో స్పీడ్, కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. ఈ మొబైల్ ధర రూ.10,000 లోపే, అంటే సుమారు రూ.9,499 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
7000mAh బ్యాటరీతో Oppo Reno 15C.. Snapdragon 6 Gen 1 చిప్+ ట్రిపుల్ రియర్ కెమెరా
అయితే ఇప్పటివరకు శాంసంగ్ సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా ప్రకటించలేదు. ధర, లాంచ్ తేదీ, ఏఏ మార్కెట్లలో విడుదల చేస్తారనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు Samsung Galaxy A37, Samsung Galaxy A57 అనే మరో రెండు కొత్త A సిరీస్ స్మార్ట్ఫోన్లు కూడా విడుదలయ్యే అవకాశముందని సమాచారం. ఈ రెండు మోడళ్లలో ముఖ్యంగా కెమెరా హార్డ్‌వేర్‌లో పెద్ద అప్‌గ్రేడ్స్ ఉండొచ్చని టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.