NTV Telugu Site icon

Jio Free YouTube Premium Subscription: జియో యూజర్స్‌కు పండగే.. రెండేళ్ల వరకు ఆ సేవలు ఫ్రీ!

టెలికాం రంగంలో సంచలనాలకు పెట్టింది పేరు రిలయన్స్ జియో. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్నట్లుగా జియో సరికొత్త ప్లాన్స్ తో మిగతా టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోంది. యూజర్ల కోసం ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ టెల్కో కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఈ క్రమంలో మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పండగ వేళ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కోట్లాది మంది వినియోగదారుల కోసం జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్. అయితే ఇది జియో యూజర్లందరికీ వర్తించదు. జనవరి 11 నుంచి జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం ఈ ప్రయోజనాలను అందించనున్నది.

అర్హులైన యూజర్లకు రెండు సంవత్సరాల పాటు యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ బెనిఫిట్స్ పొందుతారు. జియో ప్రకటించిన ఈ ఆఫర్ తో యూజర్లు యాడ్స్ లేకుండా కంటెంట్ ను చూసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ఆఫర్ ను పొందడానికి జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు రూ. 888, రూ. 1199, రూ. 1499, రూ. 2499, రూ. 3499 లలో ఏదైనా ప్లాన్ ను కలిగి ఉండాలి. యూట్యూబ్ ప్రీమియమ్ ద్వారా జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఇష్టమైన వీడియోలను, సినిమాలను ఎలాంటి యాడ్ బ్రేక్స్ లేకుండా, నిరంతరాయంగా వీక్షించొచ్చు. ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను చూడొచ్చు. అంటే, మీ మొబైల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, మీరు యూట్యూబ్ వీడియోలను చూడగలుగుతారు. దీనికి మీరు ముందుగా డౌన్‌లోడ్ చేసిన వీడియోలను మాత్రమే చూడగలరు. ఇతర యాప్స్ ఉపయోగిస్తూనే వీడియోలు చూడవచ్చు. లేదా స్క్రీన్ ఆఫ్ అయినప్పటికీ మ్యూజిక్ వినవచ్చు.

యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ యాక్టివేట్ కోసం..

MyJio యాప్‌లో మీ అకౌంట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది.

తర్వాత యూట్యూబ్ ప్రీమియమ్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ యూట్యూబ్ ఖాతాతో లాగిన్ అవ్వాలి.

అదే సమాచారంతో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెట్ టాప్ బాక్స్‌లో లాగిన్ అయి, యాడ్-ఫ్రీ కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

Show comments