Site icon NTV Telugu

Jio Phone 5G: జియో ఫోన్‌ 5జీ వస్తోంది.. వివరాలు ఇవే..

Reliance Jio 5g Phone

Reliance Jio 5g Phone

Jio Phone 5G: టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియోగదారులు 4G సేవలను ప్రోత్సహించడానికి గతేడాది జియోఫోన్‌ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది. జియోఫోన్ తర్వాత జియోఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసింది. రూ.5 వేలకు ఆకర్షణీయమైన ఫీచర్స్ ఇస్తుండడంతో వినియోగదారులు ఆసక్తిని కనబరిచారు. దీనికి కొనసాగింపుగా జియో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. ఇప్పటికే 5జీ ఫోన్‌కు సంబంధించిన పనులపై కంపెనీ దృష్టి సారించింది. దసరా లేదా ఈ ఏడాది చివరి వరకు మార్కెట్లో ఈ ఫోన్ రానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తు్న్నాయి. మరి ఈ ఫోన్‌లో ఫీచర్లతో పాటు ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం.

ఫీచర్లు ఇవే: జియో ఫోన్‌ 5జీ 6.5 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు గూగుల్ జియో కలిసి అభివృద్ధి చేసిన ప్రగతి ఆపరేటింగ్ సిస్టంతోనే ఈ ఫోన్ పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 480 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌ 51 మోడెమ్‌ ఉంటుంది. ఈ మొబైల్‌ 5 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తాయని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రైమరీ కెమెరా 13ఎంపీ, ఫ్రంట్ కెమెరా 8ఎంపీలతో రానున్నట్లు సమాచారం. వెనుక లేదా సైడ్‌లో ఫింగర్‌ ప్రింగ్‌ సెన్సర్‌ ఉంటుందని టెక్‌ వర్గాలు తెలిపాయి. జియోకు సంబంధించిన మై జియో, జియో టీవీ వంటి వాటితో పాటు ఉచితంగా ఇతర జియో యాప్స్‌ కూడా ఇస్తారు.

Himanshu tweet: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ కు కేసీఆర్‌ మనవడు రీ ట్వీట్‌.. వైరల్‌

5000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. దీనితో 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే 4జీబీ ర్యామ్, 32జీబీ అంతర్గత స్టోరేజీతో రానున్నట్లు సమాచారం. డ్యూయల్‌ సిమ్‌, మెమొరీ కార్డు ఆప్షన్‌ ఇస్తున్నట్లు అంచనా. ఇక ధర విషయానికొస్తే దాదాపు రూ.10వేల నుంచి రూ.12 వరకు ఉండొచ్చని మార్గెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జియో ఫోన్ నెక్ట్స్ తరహాలో వినియోగదారులు ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశం ఇస్తారని సమాచారం.

Exit mobile version