Jio Phone 5G: జియో ఫోన్ 5జీ వస్తోంది.. వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Phone 5G: టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియోగదారులు 4G సేవలను ప్రోత్సహించడానికి గతేడాది జియోఫోన్‌ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది. జియోఫోన్ తర్వాత జియోఫోన్ నెక్స్ట్ను విడుదల చేసింది. రూ.5 వేలకు ఆకర్షణీయమైన ఫీచర్స్ ఇస్తుండడంతో వినియోగదారులు ఆసక్తిని కనబరిచారు. దీనికి కొనసాగింపుగా జియో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. ఇప్పటికే 5జీ ఫోన్‌కు సంబంధించిన పనులపై కంపెనీ దృష్టి సారించింది. దసరా లేదా ఈ ఏడాది చివరి వరకు మార్కెట్లో ఈ ఫోన్ రానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తు్న్నాయి. మరి ఈ ఫోన్లో ఫీచర్లతో పాటు ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం.
ఫీచర్లు ఇవే: జియో ఫోన్ 5జీ 6.5 అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు గూగుల్ జియో కలిసి అభివృద్ధి చేసిన ప్రగతి ఆపరేటింగ్ సిస్టంతోనే ఈ ఫోన్ పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 51 మోడెమ్ ఉంటుంది. ఈ మొబైల్ 5 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తాయని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రైమరీ కెమెరా 13ఎంపీ, ఫ్రంట్ కెమెరా 8ఎంపీలతో రానున్నట్లు సమాచారం. వెనుక లేదా సైడ్‌లో ఫింగర్ ప్రింగ్ సెన్సర్ ఉంటుందని టెక్ వర్గాలు తెలిపాయి. జియోకు సంబంధించిన మై జియో, జియో టీవీ వంటి వాటితో పాటు ఉచితంగా ఇతర జియో యాప్స్ కూడా ఇస్తారు.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
Himanshu tweet: ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు కేసీఆర్ మనవడు రీ ట్వీట్.. వైరల్
5000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. దీనితో 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే 4జీబీ ర్యామ్, 32జీబీ అంతర్గత స్టోరేజీతో రానున్నట్లు సమాచారం. డ్యూయల్ సిమ్, మెమొరీ కార్డు ఆప్షన్ ఇస్తున్నట్లు అంచనా. ఇక ధర విషయానికొస్తే దాదాపు రూ.10వేల నుంచి రూ.12 వరకు ఉండొచ్చని మార్గెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జియో ఫోన్ నెక్ట్స్ తరహాలో వినియోగదారులు ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశం ఇస్తారని సమాచారం.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!