Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
- గేమర్ల కోసం Redmi అదిరిపోయే TV
- 360Hz Competition Mode, Mini LED డిస్ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi TV X RGB Mini LED 2027 Launched: ప్రముఖ టెక్ సంస్థ Xiaomiకి చెందిన Redmi బ్రాండ్ కొత్త Redmi TV X RGB-Mini LED 2027 Competition Editionను చైనాలో విడుదల చేసింది. గేమింగ్‌తో పాటు హై క్వాలిటీ కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. ఈ టీవీకి 360Hz Competition Mode, RGB Mini LED బ్యాక్‌లైట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. చైనాలో ఈ టీవీ మొదటి విక్రయం అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. 55 అంగుళాల మోడల్ ధర 2,705 యువాన్లు కాగా, భారత కరెన్సీలో సుమారు రూ.39,000గా ఉంటుంది. అయితే భారత్‌లో ఈ టీవీ విడుదలపై Redmi ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
RGB Mini LED డిస్ప్లే
Redmi TV X RGB-Mini LED 2027 Competition Editionలో ప్రత్యేకమైన RGB Mini LED బ్యాక్‌లైట్ టెక్నాలజీను అందించారు. ఇందులో ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులకు ప్రత్యేక లైట్ సోర్సులను ఉపయోగించారు. ఈ టెక్నాలజీ వల్ల సాధారణ Mini LED టీవీలతో పోలిస్తే రంగుల ప్రదర్శన మెరుగుపడటంతో పాటు విద్యుత్ వినియోగం సుమారు 30 శాతం వరకు తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. డిస్ప్లే 100% BT.2020 కలర్ గ్యామట్ ను కవర్ చేస్తుంది. అలాగే 1,300 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. స్క్రీన్‌పై AG Nano-Texture ఉండటంతో గ్లేర్, రిఫ్లెక్షన్స్ తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
గేమింగ్ కోసం 360Hz Competition Mode
ఈ కొత్త Redmi టీవీ ప్రధానంగా గేమింగ్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. సాధారణంగా డిస్ప్లే 180Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. అయితే Competition Modeను యాక్టివేట్ చేస్తే ఇది 360Hz వరకు పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. 360Hz అనేది Competition Mode ద్వారా లభించే మోడ్, దీనిని నేటివ్ 360Hz రిఫ్రెష్ రేట్గా భావించకూడదు.
నాలుగు స్క్రీన్ సైజుల్లో లభ్యం
55 అంగుళాలు – 432 Local Dimming Zones
65 అంగుళాలు – 528 Local Dimming Zones
75 అంగుళాలు – 720 Local Dimming Zones
85 అంగుళాలు – 864 Local Dimming Zones
పెద్ద స్క్రీన్ మోడళ్లలో ఎక్కువ Local Dimming Zones ఉండటంతో డిస్ప్లేలోని వివిధ ప్రాంతాల బ్రైట్నెస్ను మరింత ఖచ్చితంగా నియంత్రించవచ్చు. దీని వల్ల డార్క్ సీన్స్, బ్రైట్ సీన్స్‌లో కాంట్రాస్ట్ మెరుగ్గా కనిపించే అవకాశం ఉంది.
ప్రాసెసర్, RAM, స్టోరేజ్
హార్డ్‌వేర్ విషయానికి వస్తే ఈ టీవీలో 5-core Cortex-A55 ప్రాసెసర్, Mali-G52 GPU అందించారు. దీనికి 3GB RAM, 64GB స్టోరేజ్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ పరంగా Xiaomi HyperOS 4పై ఈ టీవీ పనిచేస్తుంది. ఇందులో కొత్త తరం Xiao Ai అసిస్టెంట్‌తో పాటు Xiaomi Smart Home Ecosystemకు కనెక్ట్ అయ్యే సదుపాయం కూడా ఉంది. కనెక్టివిటీ కోసం టీవీలో మొత్తం మూడు HDMI పోర్టులు ఉన్నాయి. వీటిలో రెండు HDMI 2.1 పోర్టులు ఉన్నాయి. HDMI 2 పోర్ట్ eARCకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇతర కనెక్టివిటీ ఆప్షన్లలో 2 USB పోర్టులు, Ethernet, AV, ATV/DTMB, Optical S/PDIF, Dual-Band Wi-Fi 6, Bluetooth 5.2 అందుబాటులో ఉన్నాయి.
30W ఆడియో అవుట్‌పుట్
ఆడియో కోసం Redmi కొత్త టీవీలో నాలుగు స్పీకర్లను అందించింది. వీటి మొత్తం అవుట్‌పుట్ 2×15W, అంటే మొత్తం 30Wగా ఉంది. గేమింగ్, సినిమాలు, స్పోర్ట్స్ వంటి కంటెంట్‌కు సరిపోయే ఆడియో అనుభవాన్ని అందించేందుకు ఈ సెటప్‌ను తీసుకొచ్చారు.
Redmi TV X ధర ఎంత?
55 అంగుళాలు -2,705 యువాన్లు -రూ.39,000
65 అంగుళాలు -3,411 యువాన్లు -సుమారు రూ.49,000
75 అంగుళాలు -4,117 యువాన్లు -సుమారు రూ.58,000
85 అంగుళాలు -5,293 యువాన్లు -సుమారు రూ.76,300
చైనాలో ఈ టీవీ తొలి సేల్ అక్టోబర్ 12న ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్‌లో దీని ధర లేదా లాంచ్ తేదీపై Xiaomi/Redmi నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడ కాలేదు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!