Redmi Pad 2: రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
- రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల
- సుమారుగా రూ. 13,000 ధరతో విడుదలైంది
- 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 7,600mAh బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ ప్రపంచ మార్కెట్లో విడుదలైంది. ఈ టాబ్లెట్ కలర్స్, రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ రెడ్‌మి టాబ్లెట్‌ను క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్, 7600mAh బ్యాటరీతో పరిచయం చేశారు. ఈ రెడ్‌మి టాబ్లెట్‌లో 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ 9.7-అంగుళాల 2K డిస్‌ప్లేను కలిగి ఉంది.
రెడ్‌మి ప్యాడ్ 2, 4GB+64GB స్టోరేజ్‌తో కూడిన Wi-Fi-మాత్రమే మోడల్ కోసం MYR 549 (సుమారుగా రూ. 13,000) ధరతో విడుదలైంది. 4G వేరియంట్ ధర MYR 649 (సుమారుగా రూ. 16,000). 128GB వేరియంట్ ధర MYR 599 (సుమారుగా రూ. 14,000). 4G వేరియంట్ ధర MYR 699 (సుమారుగా రూ. 17,000). ఈ కొత్త రెడ్‌మి టాబ్లెట్ ప్రస్తుతం మలేషియా, సింగపూర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. కంపెనీ తాజా రెడ్‌మి ప్యాడ్ 2 గ్రాఫైట్ గ్రే, సిల్వర్ రంగులలో లభిస్తుంది.
Also Read
- Redmi K90 Ultra: రెడ్ మీ K90 అల్ట్రా రిలీజ్.. 8,550mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్
- OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
- Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు
- Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్‌ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్‌ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్‌లో 9.7-అంగుళాల 2K (2,048 x 1,280 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz వరకు, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz వరకు, గరిష్ట ప్రకాశం 500 నిట్స్‌గా ఉంటుంది. ఈ డిస్‌ప్లే TÜV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సర్కాడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్‌లను కూడా కలిగి ఉంది.
ఈ రెడ్‌మి టాబ్లెట్ 6nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ, 4జీబీ ఎల్‌పిడిడిఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా ఈ టాబ్లెట్ స్టోరేజ్‌ను 2టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఈ షియోమి టాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 పై పనిచేస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, రెడ్‌మి ప్యాడ్ 2లో 8-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా ఉంది. 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందించారు. ఇది 1080p/30 fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ టాబ్లెట్‌లో డ్యూయల్ స్పీకర్ సెటప్ కూడా ఉంది. రెడ్‌మి ప్యాడ్ 2లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 7,600mAh బ్యాటరీ ఉంది.
తాజావార్తలు
-
Tridha: బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్లే బ్రేకప్‌కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్‌గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..