Site icon NTV Telugu

ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, ప్రీమియం ఆడియో అనుభవం.. REDMI Buds 8 Pro లాంచ్.!

Redmi Buds 8 Pro

Redmi Buds 8 Pro

REDMI Buds 8 Pro: తాజాగా విడుదలైన REDMI Turbo 5 సిరీస్‌తో పాటు లేటెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బ‌డ్స్ (TWS) రెడ్ మీ బడ్స్ 8 ప్రో (REDMI Buds 8 Pro)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం ఆడియో క్వాలిటీతో పాటు అడ్వాన్స్‌డ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని అందించేలా ఈ బడ్స్‌ను డిజైన్ చేశారు.

ఈ రెడ్ మీ బడ్స్ 8 ప్రోలో 6.7mm డ్యూయల్ పీజోఎలక్ట్రిక్ సిరామిక్ డ్రైవర్‌లు, 11mm టైటానియం-ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్ ఉన్నాయి. ఈ సెటప్ వల్ల స్పష్టమైన హైస్, డీప్ బాస్‌తో హై-రిజల్యూషన్ ఆడియో అవుట్‌పుట్ లభిస్తుందని షియోమీ చెబుతోంది. ఇవి Hi-Res Audio Wireless, LHDC-V5 కోడెక్‌తో పాటు షియోమీ సొంత MIHC (MI High Clarity Codec) 2.0 ను సపోర్ట్ చేస్తాయి.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 512GB స్టోరేజ్, 520Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో Red Magic 11 Air లాంచ్

ప్రస్తుతం MIHC 2.0 సపోర్ట్ కొన్ని మోడళ్లకే అందుబాటులో ఉంది. అయితే తాజా Turbo 5 సిరీస్‌కు ఇది సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా అందే అవకాశం ఉందని కంపెనీ సంకేతాలు ఇచ్చింది. ఈ బడ్స్‌లో షియోమీ తాజా ‘డీప్ స్పేస్ నాయిస్ క్యాన్సలింగ్ 3.0’ టెక్నాలజీని ఉపయోగించారు. దీని ద్వారా 55dB వరకు నాయిస్ రిడక్షన్ డెప్త్, 5kHz నాయిస్ రిడక్షన్ బ్యాండ్‌ విడ్త్ అందుతుంది. అంతేకాదు కాల్‌ల సమయంలో 95dB అంబియెంట్ నాయిస్ రిడక్షన్, 12m/s విండ్ నాయిస్ రెసిస్టెన్స్ ఉండటంతో బయట శబ్దాల ప్రభావం తగ్గుతుంది.

రెడ్ మీ బడ్స్ 8 ప్రో చార్జింగ్ కేస్‌లో ప్రత్యేకమైన LED లైటింగ్ ఫీచర్ ఉంది. కేస్ ఓపెన్ చేయగానే లేదా క్లోజ్ చేసినప్పుడు, అలాగే చార్జింగ్ బటన్ నొక్కినప్పుడు బ్యాటరీ లెవెల్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బడ్స్ ఒక్కసారి చార్జ్ చేస్తే 8.5 గంటల వరకు వినియోగించుకోవచ్చు. చార్జింగ్ కేస్‌తో కలిపితే మొత్తం 35 గంటల బ్యాటరీ లైఫ్ అందుతుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 5 నిమిషాల చార్జ్‌కు 2 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. రెడ్ మీ బడ్స్ 8 ప్రో మిస్ట్ బ్లూ, వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. చైనాలో దీని ధర 399 యువాన్ (రూ. 5,200). ఇందుకు సంబంధించి ఇప్పటికే చైనా మార్కెట్‌లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

Putin-Zelensky: 4 ఏళ్ల యుద్ధం తర్వాత కీలక పరిణామం.. జెలెన్‌స్కీని మాస్కోకు ఆహ్వానించిన రష్యా

ముఖ్య స్పెసిఫికేషన్లు:
* డ్యూయల్ DAC డ్రైవర్‌లు
* ANC: 55dB నాయిస్ రిడక్షన్, 5kHz బ్యాండ్‌విడ్త్
* అంబియెంట్ కాల్ నాయిస్ రిడక్షన్: 95dB
* Bluetooth 5.4
* కోడెక్‌లు: SBC / AAC / LHDC / MIHC / LC3
* Dolby Audio సపోర్ట్
* మల్టీ-డివైస్ కనెక్షన్, స్మార్ట్ ఆడియో స్విచింగ్
* ఆడియో షేరింగ్: ఒకేసారి రెండు హెడ్‌ఫోన్లు కనెక్ట్ చేయవచ్చు
* బ్యాటరీ: 8.5 గంటలు (బడ్స్), 35 గంటలు (కేస్‌తో).

Exit mobile version