50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- భారత మార్కెట్లో రెడ్మీ 17C 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్..
- 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999
- 6.9 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi 17C 5G Launched: షావోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ నుంచి మరో కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. రెడ్మీ 17 5జీ తర్వాత తాజాగా రెడ్మీ 17సీ 5జీ (Redmi 17C 5G)ని లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌నే భారత్‌లోనూ అదే డిజైన్, స్పెసిఫికేషన్లతో తీసుకొచ్చారు. 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
భారత్‌లో ఈ మొబైల్ ధర రూ.20,999 నుంచి ప్రారంభమవుతుంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా ఉండగా.. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.22,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ అక్టోబర్ 7 నుంచి అమెజాన్, షావోమీ ఆన్లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కాఫీ బ్రూ, డార్క్ నైట్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Also Read
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
ఈ కొత్త మొబైల్ లో 6.9 అంగుళాల HD+ LCD డిస్ప్లే అందించారు. ఇది 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 810 నిట్స్ HBM బ్రైట్నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 16.7 మిలియన్ కలర్స్, 83 శాతం NTSC కలర్ గ్యామట్ ఇందులో ఉన్నాయి. కళ్లకు సౌకర్యవంతమైన వినియోగం కోసం TÜV Rheinland నుంచి లో బ్లూ లైట్, సర్కేడియన్ ఫ్రెండ్లీ, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. ఫోన్‌కు IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ లభించింది.
పెర్ఫార్మెన్స్ కోసం ఫోన్లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 2.4GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం మాలి-G57 MC2 GPU ఉంది. 6GB వరకు LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ద్వారా మరో 6GB వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.
కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంది. ఇది f/1.8 అపెర్చర్‌తో 1080p వీడియోను 30fps వద్ద రికార్డ్ చేయగలదు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. దీనికి f/2.0 అపెర్చర్ అందించారు. కెమెరాలో HDR, సాఫ్ట్-లైట్ రింగ్, పోర్ట్రెయిట్, టైమ్-ల్యాప్స్, నైట్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, USB టైప్-C, GPS, GLONASS, Galileo, BeiDou వంటి ఆప్షన్లు ఉన్నాయి.
Every moment deserves the spotlight when you’ve got #MainCharacterEnergy.
Meet the #REDMI17C 5G with a 50MP AI Dual Camera, 6000mAh battery with 33W fast charging and a Premium Vegan Leather finish.
Starting at ₹20,999. Sale Starts 7th Oct.
Know More: https://t.co/sci556Mdhr pic.twitter.com/6Iufwxc998— Redmi India (@RedmiIndia) October 1, 2026
తాజావార్తలు
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?