50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
- Redmi 17 5G భారత్‌లో సెప్టెంబర్ 3న అధికారికంగా లాంచ్..
- Qualcomm Snapdragon 4 Gen 5 ప్రాసెసర్
- 7,900mAh బ్యాటరీ
- 50MP డ్యూయల్ కెమెరా సెటప్
- కొత్త Astral Camera Deco డిజైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi 17 5G: షావోమీకి (Xiaomi) చెందిన రెడ్మి (REDMI) నుంచి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి రాబోతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయినా Redmi 17 5Gను భారత్‌లో సెప్టెంబర్ 3న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే భారత మోడల్లో కొన్ని స్పెసిఫికేషన్లు కాస్త భిన్నంగా ఉండనున్నాయి. భారీ బ్యాటరీ, కొత్త ప్రాసెసర్, అప్డేటెడ్ కెమెరా డిజైన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది.
స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్:
రెడ్మి 17 5Gలో పనితీరు కోసం Qualcomm Snapdragon 4 Gen 5 ప్రాసెసర్‌ను అందించనున్నారు. రోజువారీ వినియోగం, మల్టీటాస్కింగ్‌తో పాటు 5G కనెక్టివిటీకి అనుగుణంగా ఈ చిప్‌సెట్‌ను రూపొందించారు. బడ్జెట్, మిడ్‌రేంజ్ విభాగంలో మంచి పనితీరు అందించేలా ఈ ఫోన్‌ను కంపెనీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- 10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
- Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
- Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
బ్యాటరీ & కెమెరా:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో ప్రధాన ఆకర్షణగా 7,900mAh భారీ బ్యాటరీ ఉండనుంది. ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే వారికి ఈ బ్యాటరీ ఉపయోగకరంగా ఉండనుంది. అలాగే ఫోన్లో 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీంతో అవసరమైన సమయంలో ఇతర స్మార్ట్ఫోన్లు, ఇయర్‌బడ్స్ వంటి డివైజ్‌లను Redmi 17 5G ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు.
కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనుక భాగంలో కొత్త ఆస్ట్రల్ కెమెరా డెకో (Astral Camera Deco) డిజైన్‌ను అందించారు. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రధాన కెమెరాగా 50MP సెన్సార్ ను అందించనున్నారు. ముందు భాగంలో సెంటర్-అలైన్డ్ పంచ్-హోల్ డిజైన్‌లో సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.
డిజైన్:
డిజైన్ పరంగా మొబైల్ వెనుక భాగంలో టెక్స్చర్డ్ ఫినిష్ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ను ఎటర్నల్ ఆరంజ్, ఎండ్ లెస్ బ్లూ, అబ్సొల్యూట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో తీసుకురానున్నారు. లాంచ్ తర్వాత అమెజాన్, mi.comతో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకాలు జరగనున్నాయి. అయితే ఫోన్ ధర, ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లు, సేల్ ప్రారంభ తేదీ వంటి పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 3న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్లో Redmi 17 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలను షావోమీ వెల్లడించనుంది.
తాజావార్తలు
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!