REDMAGIC Gaming Tablet 5 Pro : రెడ్ మ్యాజిక్ (REDMAGIC) నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ గేమింగ్ టాబ్లెట్ REDMAGIC Gaming Tablet 5 Proను చైనా మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ అయ్యింది. గత ఏడాది వచ్చిన 3 Proకి అప్డేటెడ్ గా వచ్చిన ఈ కొత్త టాబ్లెట్, మొబైల్ గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక హార్డ్‌వేర్‌తో రూపొందించబడింది. ప్రత్యేకంగా 9.06 అంగుళాల 2.4K OLED డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఇది గేమింగ్ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను సృష్టించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ టాబ్లెట్ REDMAGIC Astra 2 Gaming Tablet పేరుతో విడుదల కానుంది.
ప్రీమియం లుక్:
డిజైన్ పరంగా REDMAGIC తన సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ లుక్‌ను కొనసాగించింది. టాబ్లెట్ వెనుక భాగంలో పారదర్శక ప్యానెల్‌ను అందించడం వల్ల అంతర్గత లిక్విడ్ కూలింగ్ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం 4.9 మి.మీ. బెజెల్స్‌తో 90.1% స్క్రీన్-టు-బాడీ రేషియోను అందిస్తోంది. ఫ్లాట్ రియర్ డిజైన్, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ వల్ల ఎక్కువ సమయం గేమింగ్ ఆడేటప్పుడు మెరుగైన గ్రిప్‌తో పాటు వేడి వెదజల్లడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా 11 RGB LED లైట్లతో కస్టమైజ్ చేసుకునే లైటింగ్ సిస్టమ్‌ను కూడా అందించింది.
Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్:
ఈ టాబ్లెట్‌లో 3nm టెక్నాలజీపై తయారైన Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి తోడు REDMAGIC ప్రత్యేకంగా రూపొందించిన RedCore R4 Gaming Chip GPU పనితీరును మెరుగుపరచడంతో పాటు మెమరీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. అలాగే Energy Cube 3.0 అనే AI ఆధారిత ఆప్టిమైజేషన్ ఇంజిన్ గేమ్ అవసరాలకు అనుగుణంగా CPU, GPU, మెమరీ వనరులను సమతుల్యం చేస్తూ స్థిరమైన ఫ్రేమ్‌రేట్లను అందిస్తుంది. 2K రిజల్యూషన్ గేమింగ్‌తో పాటు 200కు పైగా గేమ్‌లలో 144Hz ఫ్రేమ్ ఇంటర్‌పొలేషన్‌కు మద్దతు ఉంది.
185Hz OLED డిస్‌ప్లే:
డిస్‌ప్లే విషయానికి వస్తే.. దీనికి 9.06 అంగుళాల 2.4K OLED ఈస్పోర్ట్స్ స్క్రీన్‌ను అందించారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 185Hz వరకు సపోర్ట్ చేస్తుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 5280Hz PWM డిమ్మింగ్, SGS లో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్లు కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి. Synaptics S3930 టచ్ చిప్ కారణంగా 300Hz మల్టీ-టచ్ శాంప్లింగ్ రేట్, 2000Hz ఇన్‌స్టాంట్ టచ్ రెస్పాన్స్, కేవలం 1ms లేటెన్సీ లభిస్తుంది. తడి చేతులతో ఉపయోగించినా టచ్ ఖచ్చితత్వం తగ్గకుండా ప్రత్యేక వెట్-టచ్ అల్గోరిథమ్‌ను అందించారు.
తొలిసారి యాక్టివ్ లిక్విడ్ కూలింగ్:
గేమింగ్ సమయంలో వేడి సమస్యను తగ్గించేందుకు ఇండస్ట్రీలోనే తొలిసారిగా టాబ్లెట్‌లో యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ను అమలు చేశారు. ఫ్లోరినేటెడ్ లిక్విడ్ కూలెంట్, అల్ట్రా థిన్ మైక్రో పంప్, లిక్విడ్ మెటల్ 3.0, పెద్ద వెపర్ చాంబర్ వంటి టెక్నాలజీలు కలిసి ప్రాసెసర్ ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ ఎక్కువసేపు అధిక పనితీరును కొనసాగిస్తాయి.
8300mAh బ్యాటరీ:
ఈ టాబ్లెట్‌లో 8300mAh భారీ బ్యాటరీని అందించారు. చైనా వేరియంట్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంది. రెండు USB Type-C పోర్టులు ఉండటం ప్రత్యేకత. గేమింగ్ సమయంలో చేతులకు అడ్డం కాకుండా ఒక పోర్ట్‌ను ప్రత్యేకంగా అమర్చారు. రెండు పోర్టులు కూడా బైపాస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి తగ్గి వేడి కూడా తగ్గుతుంది.
AI ఫీచర్స్:
మల్టీమీడియా కోసం DTS:X అల్ట్రా సర్టిఫైడ్ డ్యూయల్ 1620 స్టీరియో స్పీకర్లను అందించారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, USB 3.2 Gen 2 కనెక్టివిటీ, Wi-Fi 7, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 4K 144Hz ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే అవుట్ పుట్, కాల్స్ & మెసేజ్‌ల క్రాస్-డివైస్ సింక్రనైజేషన్ వంటి ఎకోసిస్టమ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత REDMAGIC OS 11.5పై ఈ టాబ్లెట్ పనిచేస్తుంది. ఇందులో MORA AI Agent 2.0 ఉండి గేమ్ రికార్డింగ్, వీడియో ఎడిటింగ్, పనితీరు ఆప్టిమైజేషన్, ఐ-కేర్ ఈ-ఇంక్ రీడింగ్ మోడ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
కెమెరాలు:
కెమెరాల విషయానికి వస్తే వెనుక భాగంలో 13MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. టాబ్లెట్ బరువు 363 గ్రాములు కాగా.. మందం కేవలం 6.9 మిల్లీమీటర్లు మాత్రమే.
ధర:
ఈ టాబ్లెట్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 5,299 యువాన్ (రూ.73,835), 16GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర 5,999 యువాన్ (రూ.83,600), 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 యువాన్ (రూ.97,535)గా నిర్ణయించారు. ఈ టాబ్లెట్ జూన్ 30 నుంచి చైనాలో బ్లాక్, సిల్వర్ రంగుల్లో అమ్మకాలకు అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ డివైస్ REDMAGIC Astra 2 Gaming టాబ్లెట్ పేరుతో విడుదల కానుంది. అంతర్జాతీయ ధరలు, లభ్యత, ప్రాంతాల వారీ హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ వివరాలను జూలై 17న కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.

