Realme నుండి మరో సంచలనం.. కొత్త P-సిరీస్ 5G ఫోన్ టీజర్..! “Most Wanted X” రహస్యం ఏంటో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme Most Wanted X: రియల్‌మీ (Realme) స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త. ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన రియల్‌మీ, ఇప్పుడు తన P-సిరీస్ 5G శ్రేణిలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక టీజర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా లైవ్ అయింది. రియల్‌మీ ఈ అప్‌కమింగ్ ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఒక మైక్రోసైట్ ఏర్పాటు చేశారు. ఈ పేజీలో ఎటువంటి వివరాలు ఇవ్వనప్పటికీ, ఒక పెద్ద ‘X’ గుర్తు, “India’s most wanted X. Guess what’s next?” అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని పెంచుతుంది. గతంలో P3 సిరీస్‌లో Realme P3X లాంచ్ అయినందున, ఈ ‘X’ కోడ్‌ను బట్టి రాబోయే మోడల్ Realme P4X 5G అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే రియల్‌మీ GT8 సిరీస్‌తో పాటు కొత్త P-సిరీస్ ఫోన్లు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇది P5 5G లేదా P5 Pro అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
Fitness Exercises: గ్రామాల్లో చేసే పనులతో.. జిమ్ లో మహిళలకు ట్రైనింగ్
Also Read
- ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
- Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
- Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
ఈ కొత్త P-సిరీస్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లపై ఇప్పటికే పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందులో Realme P3X లో Dimensity 6400 SoC వాడినందున.. దీని కంటే మెరుగైన చిప్‌సెట్‌తో రావచ్చు. ప్రముఖ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. RMX5108 అనే మోడల్ నంబర్ గల రియల్‌మీ ఫోన్ గీక్‌బెంచ్ (Geekbench) డేటాబేస్‌లో కనిపించింది. ఇది MediaTek Dimensity 7400 SoC తో పాటు 8GB ర్యామ్, ఆండ్రాయిడ్ 15 తో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
GlobeTrotter : ‘వారణాసి’ ఈవెంట్ ఎఫెక్ట్.. ఎస్ఎస్ రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు
టీజర్‌లో సూచించినట్లుగా ఈ కొత్త ఫోన్ గేమింగ్ ఆప్టిమైజ్డ్, మరింత శక్తివంతమైన AI సామర్థ్యం గల చిప్‌సెట్‌తో రావచ్చు. P3x లో 6.72-అంగుళాల FHD+ 120Hz LCD డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ (45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో), 50MP కెమెరా ఉన్నాయి. P4X/కొత్త P-సిరీస్ ఫోన్‌లో ఈ ఫీచర్లలో మరింత అప్‌గ్రేడ్ ఉండవచ్చు. ప్రస్తుతానికి పేరు, లాంచ్ తేదీ వంటి కీలక వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో టీజింగ్ ప్రారంభం కావడంతో.. రాబోయే రోజుల్లో రియల్‌మీ ఈ కొత్త “మోస్ట్ వాంటెడ్ X” స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ కొత్త రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ కోసం రాబోయే అప్‌డేట్‌ల కోసం వేచి NTV టెక్నాలజీ పేజీని గమనిస్తూ ఉండండి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!