Realme P4x 5G: రియల్ మీ (Realme) భారత మార్కెట్లో తన కొత్త ‘P’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ Realme P4x 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ 7,000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్రత్యేకంగా మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో మొబైల్ లాంచ్ అయ్యింది. MediaTek Dimensity 7400 Ultra చిప్‌సెట్, 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ కలసి ఈ ఫోన్‌ను మరింత ట్రెండీగా మార్చాయి. ఫోన్‌లో 5300mm² వ్యాపర్ చాంబర్, స్టీల్ ప్లేట్, కాపర్ గ్రాఫైట్ కోటింగ్‌తో కూడిన Frozen Crown కూలింగ్ సిస్టమ్ ఉంది. అలాగే ఇది IP64 రేటింగ్‌తో ధూళి, నీటి తుంపర్ల నుండి రక్షణ కూడా అందిస్తుంది.
Nubia Fold, Nubia Flip3 రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసిన నుబియా.. ఫీచర్స్ ఇవే..!
ఈ స్మార్ట్ ఫోన్ 6.72-అంగుళాల Full HD LCD డిస్‌ప్లేతో, 144Hz హై రిఫ్రెష్ రేట్ ఉండడంతో.. గేమింగ్, స్క్రోలింగ్ అనుభవాన్ని మరింత స్మూత్‌గా మారుస్తుంది. డిస్‌ప్లే గరిష్టంగా 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఇందులో 6nm MediaTek Dimensity 7400 Ultra చిప్‌సెట్‌తో వేగవంతమైన, స్థిరమైన పనితీరును అందిస్తుంది. ఇందులో 8GB RAM తో పాటు 18GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ ఉండటం వల్ల హెవీ మల్టీటాస్కింగ్ కూడా సులభంగా నిర్వహిస్తుంది. MicroSD సహాయంతో స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.
కెమెరా విభాగంలో ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 2MP రెండవ సెన్సర్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించబడింది. Realme P4x 5G మెయిన్ ఫీచర్ ఇందులో 7,000mAh భారీ బ్యాటరీ ఉండడమే. 45W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఎక్కువ సమయం ఉపయోగించే యూజర్లకు ఇది బిగ్ ప్లస్ పాయింట్. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 5G, Wi-Fi, Bluetooth, GPS, USB Type-C, Hi-Res ఆడియో సర్టిఫికేషన్, OReality స్పీకర్ సపోర్ట్ ఉన్నాయి.
ప్రాణాలు కాపాడే ఫీచర్.. Apple Watchలో ఇకపై హైపర్‌టెన్షన్ (బీపీ) హెచ్చరికలు..!
Realme P4x 5G ధర విషయంలో కంపెనీ చాలా పోటీదారులకు సవాలు విసిరింది. 6GB + 128GB బేస్ మోడల్‌ను రూ. 15,499కి అందిస్తోంది. కొంత ఎక్కువ పనితీరు కోరేవారికి 8GB + 128GB వేరియంట్‌ను రూ. 16,999కి, మరింత స్టోరేజ్ అవసరమయ్యే వారికి 8GB + 256GB వేరియంట్‌ను రూ. 17,999కి విడుదల చేసింది. డిజైన్ పరంగా కూడా వినియోగదారులకు మంచి ఎంపికలను అందిస్తూ మ్యాట్ సిల్వర్, ఎలిగెంట్ పింక్, లేక్ గ్రీన్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది.
