Site icon NTV Telugu

Realme P4 Pro 5G: 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 4K వీడియో సపోర్ట్‌తో అందుబాటులోకి రానున్న రియల్‌మీ P4 5G సిరీస్!

Realme P4 5g Pro

Realme P4 5g Pro

Realme P4 Pro 5G: రియల్‌మీ (Realme) సంస్థ ప్రకటించిన ప్రకారం Realme P4 5G మరియు Realme P4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లు ఆగష్టు 20న భారతదేశంలో అధికారికంగా విడుదల కానున్నాయి. రెండు మోడళ్లతో రానున్న ఈ సిరీస్‌లో ప్రొ మోడల్ Snapdragon చిప్‌సెట్‌తో, స్టాండర్డ్ మోడల్ MediaTek Dimensity చిప్‌సెట్‌తో రానున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ సిరీస్ ఫోన్‌ల కెమెరా కాన్ఫిగరేషన్‌ను కూడా ప్రకటించింది.

Realme P4 Pro 5G మోడల్‌లో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండగా.. ఇందులో ప్రధానంగా 50MP Sony IMX896 సెన్సార్ తోపాటు OIS (Optical Image Stabilisation) సపోర్ట్ అందించబడుతుంది. ముందు భాగంలో 50MP OV50D సెల్ఫీ కెమెరా ఉండి, ఫోన్ 4K @ 60fps మరియు 4K HDR @ 30fps వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుడా Ultra Steady వీడియో, AI Motion Stabilisation, AI Travel Snap, AI Landscape వంటి AI ఆధారిత ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

Vivo T4 Pro: మరో సంచలనానికి తెరలేపిన వివో.. డిజైన్, కెమెరా, ప్రాసెసర్ అప్‌గ్రేడ్స్‌తో రాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్!

ఇక Realme P4 5G (స్టాండర్డ్ మోడల్)లో వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ కలిగిన డ్యూయల్ సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ మోడల్ కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. AI Snap మోడ్ సహా పలు AI కెమెరా ఫీచర్లు ఇందులో లభ్యమవుతాయి.

ముఖ్య స్పెసిఫికేషన్లు:
Realme P4 Pro 5G:

ప్రాసెసర్: Snapdragon 7 Gen 4 + HyperVision AI GPU.

కూలింగ్ సిస్టమ్: 7,000 sq mm AirFlow VC.

డిస్ప్లే: HyperGlow AMOLED 4D Curve+, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 6,500 నిట్స్ బ్రైట్నెస్, 4,320Hz హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్.

బ్యాటరీ: 7,000mAh, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్.

గేమింగ్: BGMIలో 8+ గంటల గేమ్‌ప్లే @ 90fps.

సర్టిఫికేషన్: TÜV Rheinland Eye Protection.

Ashok Chakra 24 Spokes: అశోక చక్రంలో ఉన్న 24 ఆకుల (గీతలు) అర్థం ఏంటో తెలుసా?

Realme P4 5G:

ప్రాసెసర్: MediaTek Dimensity 7400 Ultra 5G + Pixelworks చిప్.

డిస్‌ప్లే: 6.77-అంగుళాల HyperGlow AMOLED, Full-HD+, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3,840Hz PWM డిమ్మింగ్.

బ్యాటరీ: 7,000mAh Titan బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ (50% ఛార్జ్ 25 నిమిషాల్లో), రివర్స్ ఛార్జింగ్, AI Smart Charging, Bypass Charging.

గేమింగ్: BGMIలో 11 గంటల గేమ్‌ప్లే.

Exit mobile version