Site icon NTV Telugu

Realme P4 Power 5G Review: రియల్‌మీ పీ4 పవర్ రివ్యూ.. బ్యాటరీ టెన్షన్ లేని స్మార్ట్‌ఫోన్!

Realme P4 Power 5g Review

Realme P4 Power 5g Review

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ లైఫ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజంతా ఫోన్ చేతిలోనే ఉండే ఈ రోజుల్లో.. ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకునే స్మార్ట్‌ఫోన్ కావాలని అందరూ కోరుకుంటారు. బ్యాటరీ లైఫ్ దృష్టిలో పెట్టుకుని చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘రియల్‌మీ’.. భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఫోనే ‘రియల్‌మీ పీ4 పవర్ 5జీ’. ఏకంగా 10,001mAh భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్.. ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌ పెట్టనుంది. ‘డెడ్ లెస్ స్మార్ట్‌ఫోన్’ అనే ట్యాగ్‌కు రియల్‌మీ పీ4 పవర్ పక్కాగా న్యాయం చేస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు.

రియల్‌మీ పీ4 పవర్ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ. సాధారణ వినియోగంలో రోజుల పాటు ఛార్జర్ అవసరం లేకుండా పనిచేస్తుంది. వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా, కాల్స్, గేమింగ్ వంటి హెవీ యూజ్‌లోనూ బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయంలో ఇది బెస్ట్ ఆప్షన్ అని బలంగా చూపొచ్చు. బ్యాటరీ మాత్రమే కాకుండా.. మిగతా ఫీచర్లలో కూడా ఈ ఫోన్ బాగానే ఉంటుంది. డిస్‌ప్లే నాణ్యత ఆకట్టుకునేలా ఉంది. రోజువారీ వినియోగం, మల్టీటాస్కింగ్‌కు పనితీరు సరిపోతుంది. హైఎండ్ గేమింగ్ లేదా హెవీ టాస్క్‌ల కోసం కాకపోయినా.. సాధారణ యూజర్లకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కెమెరాల విషయానికి వస్తే.. రియల్‌మీ పీ4 పవర్ ఫోన్‌ కాస్త వెనకబడి ఉంది. ఫోటోగ్రఫీపై ఎక్కువ ఆసక్తి ఉన్నవారికి ఇది బెస్ట్ ఛాయిస్ కాకపోవచ్చు. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి లేదా రోజువారీ అవసరాలకు మాత్రం ఇందులో ఉండే కెమెరాలు సరిపోతాయి. యూజర్ ఎక్స్‌పీరియెన్స్ కూడా స్మూత్‌గా ఉండడం మరో ప్లస్ పాయింట్. రూ.27,999 ప్రారంభ ధరలో రియల్‌మీ పీ4 పవర్ మంచి ప్యాకేజీగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటరీ టెన్షన్ లేకుండా ఫోన్ వాడాలనుకునేవారికి ఇది చక్కటి ఎంపిక. భారీ బ్యాటరీతో పాటు ఇతర అంశాల్లో పెద్దగా రాజీ పడకుండా ఈ ఫోన్‌ను రియల్‌మీ అందించింది. ఫిబ్రవరి 5 నుంచి రియల్‌మీ.కామ్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్స్‌ ద్వారా ఈ మొబైల్‌ కొనుగోలు చేయొచ్చు.

Also Read: Komalee Prasad: పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ.. తమిళంలో అరంగేట్రం చేసిన తెలుగు హీరోయిన్!

ఫైనల్లీ: బ్యాటరీ లైఫ్ మీకు మొదటి ప్రాధాన్యత అయితే రియల్‌మీ పీ4 పవర్ తప్పకుండా పరిశీలించదగ్గ ఫోన్.

రియల్‌మీ పీ4 పవర్ ఫీచర్స్:
# 6.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ 4డీ కర్వ్‌ డిస్‌ప్లే
# 144Hz రిఫ్రెష్‌ రేటు,
# 6500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
# హెచ్‌డీఆర్‌ సపోర్ట్‌
# 2.6 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌
# 50 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్‌ 882 సెన్సర్‌) మెయిన్‌ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌
# 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 10,001 mAh టైటాన్‌ బ్యాటరీ, 80W వూక్‌ అండ్ 27w రివర్స్‌ ఛార్జ్‌ ఆప్షన్‌
# ఐపీ 68, ఐపీ 69, ఐపీ 66 రేటింగ్‌

Exit mobile version