Site icon NTV Telugu

Realme Narzo 90x: 12 గంటల్లోనే లక్ష యూనిట్ల అమ్మకాలు.. ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌కు సూపర్ క్రేజ్ గురూ!

Realme Narzo 90x Sale

Realme Narzo 90x Sale

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన నార్జో సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను గత వారం భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో రియల్‌మీ నార్జో 90, రియల్‌మీ నార్జో 90 ఎక్స్ పేరిట సరికొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డిసెంబర్‌ 24 నుంచి ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌, రియల్‌మీ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫోన్స్ అమ్మకాలల్లో రికార్డు నెలకొల్పాయి.

రియల్‌మీ నార్జో 90, రియల్‌మీ నార్జో 90 ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లు 12 గంటల్లోనే లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని రియల్‌మీ కంపెనీ అధికారికంగా తెలిపింది. అమెజాన్‌లో నార్జో 90 ఎక్స్ బెస్ట్ సెల్లర్‌గా ఉందని పేర్కొంది. ఈ 5జీ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో వచ్చింది. నార్జో 90 ఎక్స్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0తో పనిచేస్తుంది. ఇందులో 6.80 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ ఉండగా.. 200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 144Hz రిఫ్రెష్‌ రేటుకు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6,300 ప్రాసెసర్‌ను ఇచ్చారు.

Also Read: Dhurandhar 2 Release: పెద్ద ప్లానింగే.. 5 భాషలలో ‘ధురంధర్-2’ విడుదల!

రియల్‌మీ నార్జో 90 ఎక్స్‌లో 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉండగా.. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 60W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మద్దతుతో 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఐపీ65 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌తో ఈ ఫోన్ వచ్చింది. బ్లూటూత్‌ 5.3, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై వంటి ఫీచర్స్ ఉన్నాయి. నార్జో 90 ఎక్స్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.13,999గా ఉండగా.. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.15,499గా ఉంది. ఇది నైట్రో బ్లూ, ఫ్లాష్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్ కింద నార్జో 90 ఎక్స్‌పై మీరు రూ.2,000 ఆదా చేసుకోవచ్చు.

 

Exit mobile version