Site icon NTV Telugu

Realme Narzo 90 సిరీస్ 5G త్వరలో లాంచ్.. స్పెసిఫికేషన్స్ ఇవే!

Realme ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్‌లో Narzo 80 Series 5G‌ను విడుదల చేసింది. తాజాగా, దానికి అప్ డేట్ సిరీస్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ షేర్ చేసిన టీజర్ ప్రకారం, Realme Narzo 90 Series 5G భారత్‌లో త్వరలో లాంచ్ కానుంది. ఈ టీజర్‌లో రెండు కొత్త మోడల్స్ కనిపించాయి. ఇవి వేర్వేరు డిజైన్లతో మార్కెట్ లోకి రానున్నాయన్నట్లు తెలుస్తుంది. ఈ రెండు మోడల్స్ Realme Narzo 90 Pro 5G, Realme Narzo 90x 5G అయ్యే ఛాన్స్ ఉంది.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

అయితే, అమెజాన్ ప్రత్యేకంగా ఈ సిరీస్ కోసం ఒక మైక్రోసైట్‌ను సృష్టించింది. Realme కూడా ఈ ఫోన్లు Amazon Specials అని ప్రకటించింది. అంటే ఇవి అమెజాన్ ద్వారా మాత్రమే విక్రయించబడే అవకాశం ఉంది. కామిక్-స్టైల్‌లో రూపొందించిన టీజర్‌లో రెండు వేర్వేరు కెమెరా లేఅవుట్స్ కనిపిస్తున్నాయి. వాటి ఆధారంగా ఇవి రెండు వేర్వేరు మోడల్స్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక, ఒక ఫోన్ కెమెరా డిజైన్ iPhone 16 Pro Max లానే ఉంది. మరో ఫోన్ మాత్రం చతురస్రాకార కెమెరా మాడ్యూల్‌తో వస్తోంది.. ఈ మోడల్ Narzo 90x 5G అయి ఉండొచ్చు. ఈ రెండు ఫోన్లు Realme కొత్త స్టైల్ ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి.

Read Also: Vande Mataram: స్వాంతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన ‘వందేమాతరం’.. ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు..?

ఇక, ఫ్లాట్ ఫ్రేమ్స్, రౌండెడ్ కార్నర్స్ లాంటి ప్రీమియం లుక్ డిజైన్ ఇందులో కనిపిస్తోంది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే మాత్రం అమెజాన్ ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే, మైక్రోసైట్‌లో “supercharged”, “power maxed” వంటి పదాలు ఉండటంతో పెద్ద బ్యాటరీలు, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. “Snap Sharp” అనే ట్యాగ్ కెమెరా పని తీరును సూచిస్తుండగా, “Glow Maxed” అనే పదం ఎక్కువ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే ఉండవచ్చని తెలుస్తుంది.

Exit mobile version