144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!

Realme Narzo 100x 5g

Realme Narzo 100x 5g

Realme NARZO 100x 5G Launched: రియల్‌మీ (Realme) భారత్‌లో తన నార్జో సిరీస్‌ను మరింత పెంచుతూ realme NARZO 100x 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, బలమైన నిర్మాణం, రోజువారీ పనులకు మంచి పనితీరు కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మొబైల్ ను తీసుకొచ్చింది.

ప్రాసెసర్ & కూలింగ్ సిస్టమ్:

realme NARZO 100x 5Gలో 6nm టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన MediaTek Dimensity 6300 5G ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అందించారు. ఇందులో రెండు Cortex-A76 కోర్లు 2.4GHz క్లాక్ స్పీడ్‌తో, ఆరు Cortex-A55 కోర్లు 2.0GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తాయి. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPUను ఉపయోగించారు. ఎక్కువసేపు గేమింగ్ లేదా హెవీ టాస్క్‌ల సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 5,300mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టంను కూడా అందించారు. ఈ ఫోన్ 6GB వరకు LPDDR4X RAM, గరిష్టంగా 256GB UFS 2.2 స్టోరేజ్‌తో లభిస్తుంది. అదనంగా డైనమిక్ RAM ఎక్స్‌పాన్షన్, మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది.

8000mAh బ్యాటరీ:

ఈ ఫోన్‌లో మెయిన్ హైలెట్ 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల పాటు సాధారణ వినియోగం చేసినా బ్యాటరీ సామర్థ్యం 80% కంటే ఎక్కువగా ఉంటుంది. 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 33 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుందని రియల్‌మీ పేర్కొంది. అలాగే 13.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటంతో ఇతర డివైస్‌లను ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ కేవలం 8.88mm మందం మాత్రమే ఉండగా, బరువు 224 గ్రాములుగా ఉంది.

144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా:

realme NARZO 100x 5Gలో 6.81 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 1200 నిట్స్ HBM బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. డిస్‌ప్లేకు “పాండా గ్లాస్” రక్షణను కూడా కల్పించారు. ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 50MP AI ప్రధాన కెమెరాతో పాటు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు.

AI ఫీచర్లు, మిలిటరీ గ్రేడ్ రక్షణ:

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 7.0పై పనిచేస్తుంది. ఇందులో జెమినీ లైవ్, AI అసిస్టెంట్ ఫర్ నోట్స్, AI ఏరేజర్ వంటి AI ఫీచర్లను అందించారు. అలాగే IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, ArmorShell నిర్మాణం, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, AI పల్స్ లైట్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

ధరలు:

భారత్‌లో realme NARZO 100x 5G 4GB + 128GB వేరియంట్ ధర రూ.20,999 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.22,999, 6GB + 256GB వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్‌లో రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ తో పాటు రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. దీంతో ప్రారంభ ధర రూ.18,499కు అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్స్ జూలై 22 నుంచి అమెజాన్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, అలాగే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.