మన దేశంలో రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. దాంతో కొత్త కంపెనీలు పుట్టుకోస్తున్నాయి.. ఒకటికి మించి మరొకటి కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి వస్తున్నాయి.. తాజాగా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ రియల్ మీ కంపెనీ తన సీ సిరీస్ ఫోన్స్‌లో 108 ఎంపీ కెమెరాతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్ మీ సీ -53 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఫోన్ ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ రానుంది. అలాగే రియల్‌మీ డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో ఆన్‌బోర్డ్ మెమరీని 12 జీబీ వరకు విస్తరించవచ్చు.
రియల్ మీ 53 4 జీబీ + 128 జీబీ వేరింయట్ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. అలాగే 6 జీబీ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ధర రూ.10,999గా ఉంటుంది. ఈ ఫోన్ జూలై 26 నుంచి ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో జూలైన 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.. ఈ మొబైల్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. అలాగే 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 180 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది.
అలాగే ఇది 6 జీబీ ర్యామ్‌తో వస్తుంది. అలాగే ఏఆర్‌ఎం మలీ-జీ 57తో ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్‌లోని ర్యామ్‌ను వర్చువల్‌గా 12 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ 108 మెగాపిక్సెల్ ఏఐ బ్యాక్డ్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.. ఈ ఫోన్ సెల్ఫీ ప్రియులకు పర్ఫెక్ట్ అనే చెప్పాలి.. ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్ ఉంటుంది..128 జీబీ వరకు ఆన్‌బోర్డ్ నిల్వను అందిస్తుంది. టైప్ సీ చార్జింగ్ పోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతునిచ్చేలా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామార్థ్యాన్ని కలిగి ఉంటుంది.. ఇంకో విషయమేంటంటే ఈ ఫోన్ కోసం జనాలు ఎగ బడుతున్నారు ఫ్రీ బుకింగ్ కూడా పూర్తి అయ్యింది..