Realme 16 Pro: రియల్ మీ (Realme) నుంచి రాబోతున్న కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రియల్ మీ 16 ప్రో (realme 16 Pro)కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ జనవరి 6, 2026న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే,డిజైన్ పరంగా ఈ మోడల్‌లో పెద్ద అప్‌గ్రేడ్స్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
రాబోయే రియల్ మీ 16 ప్రోలో శాంసంగ్ HP5 ఫ్లాగ్‌షిప్ సెన్సార్‌తో 200MP LumaColor ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది Super OIS సపోర్ట్‌తో పాటు 1x, 2x, 4x లాస్‌లెస్ జూమ్ ను అందిస్తుంది. ఈ కెమెరా సిస్టమ్ TÜV Rheinland సర్టిఫికేషన్ పొందింది. పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ కోసం “ఫైవ్ గోల్డెన్ ఫోకల్ లెంగ్త్” కిట్ (1x, 1.5x, 2x, 3.5x, 4x) ఇవ్వనుంది. AI ఫీచర్లలో Vibe Master Mode (21 పోర్ట్రైట్ టోన్స్), AI Edit Genie (హెయిర్‌స్టైల్, బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్) ఉన్నాయి. వీడియో పరంగా 4K HDR వీడియో రికార్డింగ్ (1x, 2x జూమ్)కు సపోర్ట్ ఇస్తుంది.
Champion Collections: క్రిస్మస్ విన్నర్‌గా ‘ఛాంపియన్’.. తొలిరోజే రూ. 4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్..!
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7300-Max 5G చిప్‌సెట్ ఉంది. AnTuTu స్కోర్ 9.7 లక్షలకు పైగా ఉందని రియల్ మీ తెలిపింది. థర్మల్ కంట్రోల్ కోసం ఎయిర్ ఫ్లో VC కూలింగ్ సిస్టంను అందించారు. అలాగే ఇందులో 7,000mAh టైటాన్ బ్యాటరీ ఉంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ స్లిమ్ డిజైన్‌ను కొనసాగించినట్లు కంపెనీ చెబుతోంది. AI లాంగ్-లైఫ్ బ్యాటరీ చిప్, సూపర్ పవర్ సేవింగ్ మోడ్ కూడా ఇందులో భాగం కానుంది.
ఇక డిస్‌ప్లే & డిజైన్ విషయంలో 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్స్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటూ.. డిజైన్ పరంగా ఇండస్ట్రియల్ డిజైనర్ Naoto Fukasawaతో కలిసి రూపొందించిన “Urban Wild Design” కాన్సెప్ట్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ మాస్టర్ గోల్డ్ , పెబుల్ గ్రే, ఆర్చిడ్ పర్ఫుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.
ఇక ఇది realme UI 7.0 (Flux Engineతో) పనిచేస్తుంది. ఇందులో నెక్స్ట్ AI ఫీచర్లు, AI ఫ్రేమింగ్ మాస్టర్, AI రికార్డింగ్, గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్ ఉన్నాయి. ధరలు, ర్యామ్/స్టోరేజ్ వేరియంట్ల వివరాలు జనవరి 6 లాంచ్ ఈవెంట్‌లో వెల్లడిస్తారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, realme.com, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయించనున్నారు.
