200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. స్లిమ్ బాడీ, ఫ్లాట్ డిస్‌ప్లేతో Realme 16 Pro Launch!
- ఈ సంవత్సరం రియల్‌మీ మొదటి లాంచ్ ఈవెంట్
- రియల్‌మీ 16 ప్రో సిరీస్ లాంచ్
- 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 7000mAh బ్యాటరీ
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘రియల్‌మీ’ ఈ సంవత్సరం తన మొదటి లాంచ్ ఈవెంట్‌ను ఈరోజు (జనవరి 6) నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌లో కంపెనీ రియల్‌మీ 16 ప్రో సిరీస్ సహా రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8, రియల్‌మీ ప్యాడ్ 3తో సహా అనేక ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రియల్‌మీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం కానుంది.
ఇటీవలి రోజుల్లో అత్యంత చర్చనీయాంశమైన ‘రియల్‌మీ 16 ప్రో’ సిరీస్ నేడు లంచ్ కానుంది. ఈ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు రియల్‌మీ 16 ప్రో, రియల్‌మీ 16 ప్రో ప్లస్ రిలీజ్ కానున్నాయి. రియల్‌మీ 16 ప్రో+లో కంపెనీ ప్రత్యేకంగా మొబైల్ ఫోటోగ్రఫీపై దృష్టి సారించింది. శామ్‌సంగ్ HP5 సెన్సార్‌తో నడిచే 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కు కూడా మద్దతు ఇస్తుంది. అదనంగా 50MP టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరాను కూడా కలిగి ఉండనుంది. ఇది మెరుగైన జూమ్, క్లియర్ పోర్ట్రెయిట్ ఫోటోలను తీస్తుంది.
Also Read
- Realme C100x: రియల్‌మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్‌ప్రైజ్!
- Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్‌ప్లే + 7200mAh
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్‌వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
- Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
Also Read: OnePlus 13 Price Drop: 10 వేలకే ‘వన్‌ప్లస్ 13’.. ఇలాంటి అవకాశం మళ్లీమళ్లీ రాదు బాసూ!
రియల్‌మీ 16 ప్రో కూడా శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఎంపికగా లాంచ్ కానుంది. ఇది 200MP కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్ కెమెరా, అధికనాణ్యత గల ఫ్రంట్ కెమెరాతో రానుంది. రెండు ఫోన్‌లలో 4K HDR వీడియో రికార్డింగ్, ఫోకస్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. డిజైన్ వారీగా రెండు ఫోన్‌లు స్లిమ్ బాడీ, ఫ్లాట్ డిస్‌ప్లే, సహజమైన టెక్స్చర్డ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి. ప్రో మోడల్ IP69 రేటింగ్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు 7000mAh బ్యాటరీతో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఫుల్ డీటెయిల్స్ తెలియరానున్నాయి. రియల్‌మీ ఈ ఈవెంట్లో స్మార్ట్‌ఫోన్, ఆడియో, టాబ్లెట్.. మూడు విభాగాలలో బలమైన పట్టును సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Kara Movie Trailer: ధనుష్ ‘కర’ ట్రైలర్ రిలీజ్..
-
Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
-
EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
-
Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!