Realme 16 Pro+ 5G: రియల్‌మీ (Realme) కొత్తగా Realme 16 Pro సిరీస్ ను భారత్‌లో వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో Realme 16 Pro 5G, Realme 16 Pro+ 5G మోడల్స్ ఉండనున్నాయి. ఇవి భారత్‌కు ప్రత్యేకంగా రూపొందించిన రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే Realme 16 Pro 5G స్పెసిఫికేషన్లను వెల్లడించిన కంపెనీ.. తాజాగా Realme 16 Pro+ 5Gకి సంబంధించిన కీలక వివరాలను కూడా నిర్ధారించింది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో LumaColor Image ట్యూనింగ్‌తో 200 మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్ ప్రధాన ఆకర్షణ.
Mahabubnagar: 9వ తరగతి బాలుడితో ఇంటర్ విద్యార్థిని ప్రేమాయణం.. ఆరు నెలల గర్భవతి!
రియల్‌మీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. Realme 16 Pro+ 5Gలో Qualcomm Snapdragon 7 Gen 4 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఇవ్వనున్నారు. ఈ చిప్‌సెట్ AnTuTu బెంచ్‌మార్క్‌లో సుమారు 14.4 లక్షల స్కోర్ సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. డిస్‌ప్లే పరంగా 1.48mm సన్నని బెజెల్స్, 94 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, గరిష్టంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2,500Hz టచ్ శాంప్లింగ్ రేట్,
4,608Hz డిమ్మింగ్ సపోర్ట్, Netflix HDR కంటెంట్ సపోర్ట్, సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కట్‌ఔట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12GB LPDDR5x RAM ఉంటుంది. ఇది గరిష్టంగా 8,400Mbps రీడ్/రైట్ స్పీడ్ అందిస్తుందని రియల్‌మీ చెబుతోంది. స్టోరేజ్ విషయానికి వస్తే 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. ఇక ఇందులో 7,000mAh టైటాన్ బ్యాటరీ ఉంటుంది. కంపెనీ ప్రకారం దీనితో 9.3 గంటల గేమింగ్, 20.8 గంటల ఇన్‌స్టాగ్రామ్ బ్రౌజింగ్, 21 గంటల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్, 125 గంటల స్పాటిఫై మ్యూజిక్ ప్లేబ్యాక్ సాధ్యమవుతుంది.
వీటితోపాటు ఈ ఫోన్‌కు IP66 + IP68 + IP69 + IP69K డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉండనున్నాయి. ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యంత బలమైన డ్యూరబిలిటీ ఫీచర్లలో ఒకటిగా నిలవనుంది. అలాగే ఈ ఫోన్‌లో LumaColor Image ఆధారిత 200MP ‘Portrait Master’ రియర్ కెమెరా ఇవ్వనున్నారు. కొత్తగా రూపొందించిన ‘Urban Wild’ డిజైన్తో ఇది మార్కెట్‌లోకి రానుంది.
Shocking Incident: రేబిస్ సోకిన గేదె పాలతో చేసిన రైతా.. తిన్న 200 మంది..
Realme 16 Pro+ 5Gను భారత్‌లో 2026 జనవరి 6న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర రూ. 43,999 లోపే ఉండే అవకాశం ఉంది. కలర్ ఆప్షన్లుగా మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.
