ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2026 స్పేస్ క్యాలెండర్లో తొలి ప్రయోగం చేపట్టింది. ఈరోజు (జనవరి 12) చేపట్టిన PSLV-C62 రాకెట్‌లో “EOS-N1” ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశాలకు చెందిన 15 ఇతర ఉపగ్రహాలను ప్రయోగించింది. ఉదయం 10 గంటల 17 నిమిషాల 30 సెకన్లకు శ్రీహరికోట నుంచి “PSLV-C62” నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది.
Read Also: Silver Rates: వామ్మో సిల్వర్.. మళ్లీ తాండవమే! ఈరోజు ఎంత పెరిగిందంటే..!
అయితే, శ్రీహరికోట నుంచి ప్రయోగించిన PSLV-C62 రాకెట్ ప్రయోగం నాలుగో దశలో సాంకేతిక అవాంతరాలు చోటు చేసుకున్నాయి. రాకెట్ నాలుగో దశ ప్రారంభమైన వెంటనే శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోవడంతో ప్రయోగానికి అంతరాయం ఏర్పడినట్లు ఇస్రో వెల్లడించింది. 18 నిమిషాల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రయోగం, నిర్ణీత సమయంలో పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రయోగం పురోగతిని ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ.. మూడో దశ సక్సెస్ ఫుల్ గా కంప్లీల్ అయింది. కానీ, నాలుగో దశలో ఏర్పడిన సాంకేతిక సమస్య ఏర్పడింది. సాంకేతిక లోపంపై డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ వెల్లడించారు.
ఇక, శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్.. భూపరిశీలన ఉపగ్రహానికి ‘అన్వేష’గా నామకరణం చేసింది ఇస్రో. భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించనున్న ‘అన్వేష’ EOS-N1.. సరిహద్దుల పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలలో కీలకం కానుంది. అన్వేష రక్షణ, విపత్తు నిర్వహణ రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. హైపర్‌స్పెక్ట్రల్ టెక్నాలజీతో EOS-N1 పని చేసే ‘అన్వేష’ పని చేయనుంది.