48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- పోవా AI బడ్స్ ప్రో ధర రూ.14,999.. బ్యాంక్ ఆఫర్‌తో రూ.12,499 ఎఫెక్టివ్ ధర
- 48dB వరకు హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ సపోర్ట్..
- AI మీటింగ్ సమ్మరీ, రియల్‌టైమ్ ట్రాన్స్క్రిప్షన్ వంటి ఫీచర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POVA AI Buds Pro: పోవా (POVA) నుండి భారత మార్కెట్లో కొత్తగా పోవా AI బడ్స్ ప్రో (POVA AI Buds Pro) ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ప్రొడక్టివిటీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఈ ఇయర్‌బడ్స్‌లో కాల్ రికార్డింగ్, రియల్‌టైమ్ వాయిస్ ట్రాన్స్క్రిప్షన్, AI ఆధారిత మీటింగ్ సమ్మరీ వంటి ఫీచర్లను అందించారు. రోజువారీ కాల్స్, మీటింగ్స్‌తో పాటు పని సమయంలో ఉపయోగపడేలా వీటిని రూపొందించారు.
AI ఆధారిత ఫీచర్లు:
ఈ కొత్త బడ్స్ లో రియల్‌టైమ్ స్పీచ్ ట్రాన్స్క్రిప్షన్, ఆటోమేటిక్ AI మీటింగ్ సమ్మరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీటింగ్‌లో చర్చించిన అంశాలను సారాంశంగా అందించడంతో పాటు ముఖ్యమైన యాక్షన్ ఐటమ్స్, టు-డూ లిస్ట్‌లను కూడా రూపొందించగలదు. అలాగే AI ట్రాన్స్లేషన్ ఫీచర్ ద్వారా 78 భాషల వరకు అనువాదానికి సపోర్ట్ అందిస్తుంది.
Also Read
- iQOO Smartphone: భారీగా పెరిగిన iQOO స్మార్ట్ఫోన్ల ధరలు.. iQOO 15, 15R, Neo 10 కొత్త ధరలు ఇవే!
- Uber-Rapido Merge: ఉబర్, రాపిడో విలీనం..? రవాణా రంగంలో ఊహించని ట్విస్ట్...
- Moto G Max: భారత్ లో మోటో జి మ్యాక్స్ విడుదల.. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్, 7,000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్స్ ఇవే
- విరాట్ కోహ్లీ వాడే 'హూప్' కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
ఆన్-డివైస్ రికార్డింగ్:
ఈ ఇయర్‌బడ్స్‌లో ప్రత్యేకమైన ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ఇందులోని Quick Note వన్-టచ్ ఫీచర్ ద్వారా ఫోన్‌కు నిరంతరం కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం లేకుండా గరిష్టంగా 4 గంటల వరకు ఆడియోను నేరుగా ఇయర్‌బడ్స్‌లో రికార్డ్ చేసుకోవచ్చు.
8 మైక్రోఫోన్ల సెటప్:
మెరుగైన వాయిస్ క్యాప్చర్ కోసం వీటిలో 8-మైక్రోఫోన్ అరేను అందించారు. దీనికి వాయిస్ పీకప్ యూనిట్ (VPU) సపోర్ట్ కూడా ఉంది. కాల్స్ సమయంలో వినియోగదారుడి వాయిస్‌ను స్పష్టంగా క్యాప్చర్ చేయడంతో పాటు చుట్టుపక్కల శబ్దాలను తగ్గించేందుకు ఈ సిస్టమ్ పనిచేస్తుంది.
48dB వరకు ANC:
ఈ ఇయర్‌బడ్స్‌లో హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) టెక్నాలజీ ఉంది. ఇది పరిసరాల్లోని బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను 48dB వరకు తగ్గించగలదు. దీంతో ప్రయాణాలు, ఆఫీస్ లేదా రద్దీ ప్రదేశాల్లో ఆడియో వినే సమయంలో మెరుగైన అనుభవాన్ని అందించవచ్చు.
40 గంటల బ్యాటరీ బ్యాకప్:
ఛార్జింగ్ కేస్‌తో కలిపి పోవా AI బడ్స్ ప్రో 40 గంటల వరకు మొత్తం ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. ఛార్జింగ్ కోసం USB Type-Cతో పాటు Qi వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
కనెక్టివిటీ, డ్యూరబిలిటీ:
ఒకేసారి 2 డివైస్ లతో కనెక్ట్ చేసుకునేందుకు డ్యూయల్-డివైస్ మల్టీపాయింట్ పెయిరింగ్ ఫీచర్‌ను అందించారు. దీంతో రెండు కనెక్ట్ చేసిన డివైస్ల మధ్య సులభంగా మారవచ్చు. ఇక ఇయర్‌బడ్స్‌కు IP55 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది.
ధర:
పోవా AI బడ్స్ ప్రో ధరను భారత్‌లో రూ.14,999గా నిర్ణయించారు. అయితే బ్యాంక్ ఆఫర్‌తో వీటిని రూ.12,499 ఎఫెక్టివ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. నో-కాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్ ఆగస్టు 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత్‌లో అమ్మకాలకు రానున్నాయి. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
POVA AI Buds Pro. Simply do more.
Presenting India’s 1st AI Recording + Summarization for Calls & Meetings*.
Work is now simplified. Your meetings and calls are transcribed in real time and summarized before you get out of the meeting room.
You can have it all:
☑️ Quick Note -… pic.twitter.com/QjMPole8ID— POVA India (@pova_mobile) August 14, 2026
తాజావార్తలు
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Royal Enfield Continental GT 650: రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 రిలీజ్.. USB Type-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
-
iQOO Smartphone: భారీగా పెరిగిన iQOO స్మార్ట్ఫోన్ల ధరలు.. iQOO 15, 15R, Neo 10 కొత్త ధరలు ఇవే!
-
India 1947 to 2026: 79 ఏళ్ల స్వతంత్ర భారతం.. 1947 నుంచి 2026 వరకు దేశాన్ని మార్చిన 80 కీలక ఘట్టాలు ఇవే
-
Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా ‘శనార్థి’.. సంపత్ నంది బ్యానర్లో కొత్త కాంబినేషన్!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!