Site icon NTV Telugu

Netflix సర్టిఫికేషన్‌తో Portronics Beem 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్ లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా..!

Portronics Beem 560 Smart Led

Portronics Beem 560 Smart Led

Portronics Beem 560: డిజిటల్ యాక్సెసరీస్ మార్కెట్‌లో పేరొందిన పోర్ట్రానిక్స్ (Portronics) సంస్థ కొత్తగా Beem 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్ ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ సర్టిఫికేషన్‌తో వచ్చిన ఈ ప్రొజెక్టర్, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత స్మార్ట్‌గా మార్చే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త పోర్ట్రానిక్స్ బీమ్ 560 (Portronics Beem 560)లో 5300 లూమెన్స్ LED లైట్ సోర్స్ ను అందించారు.

ఈ ప్రొజెక్టర్ ఫుల్ హెచ్‌డీ 1080p (1920×1080) రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి 100 ఇంచుల వరకు భారీ స్క్రీన్ ప్రొజెక్షన్ ఇవ్వగల సామర్థ్యం ఈ ప్రొజెక్టర్‌కు ఉంది. స్పష్టమైన విజువల్స్ కోసం ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్ ఫీచర్లను అందించారు. అలాగే టేబుల్, షెల్ఫ్ లేదా బెడ్‌సైడ్ వంటి చోట్ల సులభంగా అమర్చుకునేందుకు అడ్జస్టబుల్ టిల్ట్ యాంగిల్ డిజైన్ ను అందించారు.

యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, షోల్డర్ బటన్లతో రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?

ఈ ప్రొజెక్టర్‌ లో ఇన్‌బిల్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దీని ద్వారా నేరుగా నెట్ఫ్లిక్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లను ఉపయోగించవచ్చు. అదేవిధంగా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్‌ల నుంచి వైర్‌లెస్ స్క్రీన్ మిర్రరింగ్ కు కూడా మద్దతు ఇస్తుంది.

కనెక్టివిటీ పరంగా ఇందులో డ్యుయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, USB, HDMI, AUX పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆడియో కోసం ఇందులో ఇన్‌బిల్ట్ 3W స్పీకర్ ఉంది. మరింత సౌండ్ కోసం బ్లూటూత్ ద్వారా ఎక్స్‌టర్నల్ స్పీకర్లను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. తెల్లటి రంగులో వచ్చిన కాంపాక్ట్ డిజైన్ వల్ల బెడ్‌రూమ్, లివింగ్ రూమ్ లేదా షేర్డ్ స్పేస్‌లకు ఇది అనుకూలంగా ఉంటుంది.

MS Dhoni: అమరావతికి మహేంద్ర సింగ్ ధోని.. సీఎం చంద్రబాబుతో కీలక భేటీ..!

ఈ కొత్త Portronics Beem 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్ ధర రూ.14,499గా నిర్ణయించారు. ఇది పోర్ట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ వంటి ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలో, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ ప్రొజెక్టర్‌కు కంపెనీ ఒక సంవత్సరం తయారీదారు వారంటీను అందిస్తోంది. మొత్తంగా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం స్మార్ట్ ఫీచర్లతో కూడిన ప్రొజెక్టర్‌ను వెతుకుతున్న వారికి ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.

Exit mobile version