NTV Telugu Site icon

Portable Air Conditioner Price: ధర 2 వేలు.. 90 శాతం విద్యుత్ ఆదా! ఏసీ మాదిరి కూలింగ్

Portable Air Conditioner

Portable Air Conditioner

Portable Air Conditioner Save 90 Percent Electricity in Summer: భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండ కాస్తోంది. వేడి, ఉక్కపోతకు ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు మృత్యువాత కూడా పడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు కూలర్, ఏసీని ఉపయోగిస్తున్నారు. అయితే బడ్జెట్ లేని చాలా మంది ఫ్యాన్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఏసీ మాదిరి కూలింగ్ అనుభవించొచ్చు. పోర్టబుల్ ఎయిర్ కండీషనర్‌లు మార్కెట్‌లోకి చాలా వచ్చాయి. దీని కోసం మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో కరెంటు బిల్లు టెన్షన్ ఉండదు.

ప్రస్తుతం అతి తక్కువ ధరకే ‘పోర్టబుల్ ఏసీ’ అందుబాటులో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. మీరు ఏసీ మాదిరి గోడపై దీన్ని అమర్చాల్సి అవసరం లేదు. అదేసమయంలో కూలర్ మాదిరి కిటికీకి అమర్చాల్సి పని లేదు. ఇది పోర్టబుల్ యూనిట్ కాబట్టి.. మీరు సులభంగా దీన్ని ఏ మూలలోనైనా ఉంచవచ్చు. మీకు కావాల్సిన చోటకి ఇట్టే మార్చుకోవచ్చు. మీ వెంట కూడా తీసుకెళ్లొచ్చు. ఎలాంటి అలసట ఉండదు.

ఈ పోర్టబుల్ ఏసీలు గాలిలో ఉండే దుమ్ము, కణాలు మరియు వాయు కాలుష్య కారకాలను తొలగించే ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇవి మీకు స్వచ్ఛమైన మరియు కాలుష్య రహిత గాలిని అందిస్తాయి. అందువల్ల ఈ పోర్టబుల్ ఏసీలు మీకు వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించే గొప్ప ఎంపికగా ఉంటుంది.

Also Read: BuzBall Cricket: తగ్గేదే లే.. మేం ఇలానే ఆడుతాం! బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ కామర్స్ దొగ్గజం అమెజాన్ (Amazon)లో కేవలం రూ.2,499తో ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్‌ని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఇది అప్‌గ్రేడ్ చేయబడిన మల్టీఫంక్షన్ 4 ఇన్ 1 కూలింగ్ ఫ్యాన్‌తో వస్తుంది. దీనిలో 3 స్పీడ్‌ బటన్స్ ఉంటాయి. దీనిని మీరు సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చు. మీ ఇల్లు, ఆఫీసు లేదా మరేదైనా గదిలో పెట్టుకున్నా.. చల్లని గాలిని ఇస్తుంది. ఏసీ మాదిరి కూలింగ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు.

సాంప్రదాయ ఎయిర్ కండీషనర్లతో పోలిస్తే.. ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ వేసవిలో కనీసం 90 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే.. యూఎస్‌బీ పోర్ట్‌కి దీన్ని కనెక్ట్ చేయవచ్చు. ఇది దాని విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. మీరు అమెజాన్ నుంచి రూ.789కి కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ విద్యుత్తును ఆదా చేయడంతో పాటు ఆహ్లాదకరమైన ఎయిర్ కండిషనింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Also Read: Strong Bones Food: 30 ఏళ్ల తర్వాత వీటిని తింటే.. ఎముకలు దృఢంగా ఉంటాయి!

 

Show comments