Site icon NTV Telugu

5520mAh బ్యాటరీ, Snapdragon 6 Gen 3తో Poco M8 5G లాంచ్

Poco

Poco

Poco M8 5G: స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ Poco నుంచి కొత్తగా Poco M8 5G ఈరోజు భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతుంది. విడుదల తర్వాత ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తో పాటు Poco అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. రిలీజైన వెంటనే త్వరలోనే అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, భారత్‌లో Poco M8 5G ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ కానుంది. కంపెనీ ఈ ఫోన్‌ను సాఫ్ట్‌ లాంచ్‌గా ప్రకటిస్తుందా లేక ప్రత్యేక లైవ్‌స్ట్రీమ్‌ ఈవెంట్‌ ద్వారా నిర్వహిస్తుందా అన్నది ఇంకా వెల్లడించలేదు. ఒకవేళ లైవ్‌స్ట్రీమింగ్‌ ఉంటే, వినియోగదారులు Poco India YouTube ఛానల్ తో పాటు కంపెనీ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.

Read Also: Trump-Modi: భారత్‌పై గురి.. భారీగా సుంకాలు పెంచే యోచనలో ట్రంప్!

ధర 
ఫోన్‌ ధరను కంపెనీ అధికారికంగా లాంచ్‌ సమయంలోనే ప్రకటించనుంది. ఈ ఫోన్‌ రూ. 15,000 లోపు ధరతో భారత బడ్జెట్‌ 5G సెగ్మెంట్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రష్యా వెబ్‌సైట్‌లో ఎక్కువ ధరతో కనిపించినా, భారత్‌లో మాత్రం సరసమైన ధరతో విడుదల అయ్యే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. కాగా, Poco M8 5G కార్బన్ బ్లాక్, Glacial Blue, Frost Silver వంటి మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. రిలీజ్ తర్వాత కొద్ది రోజుల్లోనే సేల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read Also: Ashleigh Gardner: వచ్చే 5-10 ఏళ్లలో భారత జట్టును ఓడించడం చాలా కష్టం!

స్పెసిఫికేషన్స్‌ & ఫీచర్స్‌
* Android 15 ఆధారిత Xiaomi HyperOS 2.0
* 4 సంవత్సరాల OS అప్‌గ్రేడ్స్‌, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌

డిస్‌ప్లే:
* 6.77-అంగుళాల 3D Curved AMOLED డిస్‌ప్లే
* 3200 nits పీక్ బ్రైట్‌నెస్
* 1080×2392 పిక్సెల్స్ రిజల్యూషన్
* 120Hz రిఫ్రెష్ రేట్
* 100% DCI-P3 కలర్ గామట్
* 68.7 బిలియన్ కలర్స్ సపోర్ట్
* Wet Touch 2.0 ఫీచర్ (తడి చేతులతోనూ మెరుగైన టచ్ రెస్పాన్స్)

ప్రాసెసర్:
* Qualcomm Snapdragon 6 Gen 3
* AnTuTu బెంచ్‌మార్క్‌లో 8,25,000+ స్కోర్
* RAM: 8GB

రక్షణ:
* IP66 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్‌
* SGS MIL-STD-810 డ్రాప్ సర్టిఫికేషన్

ఆడియో:
* డ్యూయల్‌ స్పీకర్స్‌,
* Dolby Atmos,
* 300% వాల్యూమ్ బూస్ట్

కెమెరా సెటప్:
* 50MP ప్రధాన కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా
* 20MP సెల్ఫీ కెమెరా
* 4K వీడియో రికార్డింగ్‌, 2x in-sensor zoom

బ్యాటరీ:
* 5520mAh
* 45W ఫాస్ట్ ఛార్జింగ్
* 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
* 1.6 రోజులు బ్యాటరీ బ్యాకప్

డిజైన్‌
ఇక, ఫోన్‌ వెనుక భాగంలో squircle (చతురస్ర-వృత్తాకార మిశ్రమ) ఆకారంలోని కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్‌ అమర్చారు. ముందు భాగంలో హోల్-పంచ్ డిస్‌ప్లేలో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్‌ 7.35mm సన్నని డిజైన్, బరువు సుమారు 178 గ్రాములు, చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.

 

Exit mobile version