NTV Telugu Site icon

Poco: పోకో నుంచి త్వరలో పవర్‌ఫుల్ 5జీ ఫోన్..

Poco

Poco

పోకో కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని పోకో అధికారికంగా ప్రకటించింది. ఎఫ్ సిరీస్‌లో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. అయితే పోకో తీసుకురానున్నట్టు పోకో ఎఫ్4 5జీ అని స్పష్టమైంది. గ్లోబల్‌తో పాటు ఇండియాలోనూ ఒకేసారి ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది పోకో తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా పోకో ఎఫ్4 5జీని అధికారికంగా ప్రకటించింది. ఈ ట్వీట్‌లో ‘ఎవ్రీథింగ్ యూ నీడ్’ అని పేర్కొంది. స్మార్ట్ ఫోన్ పేరు గురించి తప్ప స్పెసిఫికేషన్ల గురించి కానీ, ధర గురించి కానీ పోకో ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతోపాటు ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు ట్వీట్ చేసింది.

పోకో ఎఫ్4 మొబైల్‌ను ఆల్‌రౌండర్‌గా తీసుకురావాలని పోకో భావిస్తోంది. ఎఫ్4 జీటీని గేమింగ్ కోసం ప్రధానంగా తీసుకురాగా.. ఎఫ్4ను మాత్రం అన్ని విభాగాల్లో సమతూకంతో లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికైతే పోకో ఎఫ్4 విడుదల తేదీని పోకో కచ్చితంగా చెప్పలేదు. అయితే త్వరలో భారత మార్కెట్‌లో ఈ ఫోన్‌ అడుగుపెట్టనుంది. ఇటీవల చైనాలో విడుదలైన రెడ్‌మీ కే40ఎస్‌ రీబ్రాండెడ్ వేరియంట్‌గా పోకో ఎఫ్4 వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఈ మొబైల్‌ స్పెసిఫికేషన్లు, అంచనా ధర ఎంత ఉండొచ్చో చూడండి.

రెడ్‌మీ కే40ఎస్ స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎఫ్4 5జీ లాంచ్ అయితే.. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ ఈ మొబైల్‌లో ఉండొచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుందని సమాచారం. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండొచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం పోకో 20 మెగాపిక్సెల్ కెెమెరాను ఇచ్చే అవకాశం ఉంది. పోకో ఎఫ్4 5జీ ఫోన్‌లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉండనుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండొచ్చు. అంటే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‌కే ఉంటుంది.

చైనాలో రెడ్‌మీ కే40ఎస్ ప్రారంభ ధర 1899 యువాన్లు అంటే సుమారు రూ.22,068గా ఉంది. దీని ప్రకారం చూస్తే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉండే పోకో ఎఫ్4 5జీ ధర భారత్‌లో రూ.23వేల నుంచి రూ.25వేల మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది.