Site icon NTV Telugu

120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ కేవలం రూ.10,999 ప్రారంభ ధరతో POCO C85 5G లాంచ్.. ఫీచర్లు ఇవే..!

Poco C85 5g

Poco C85 5g

POCO C85 5G: పోకో (POCO) సంస్థ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ POCO C85 5Gను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ యువతను లక్ష్యంగా చేసుకొని అద్భుతమైన ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల HD+ స్క్రీన్‌తో వస్తుంది. ఇది గేమింగ్, కంటెంట్ చూడడానికి మంచి అనుభవాన్ని అందించే 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇది ట్రిపుల్ TÜV Rheinland ధృవీకరణలను కూడా పొందింది. ఈ POCO C85 5G మొబైల్ శక్తివంతమైన MediaTek Dimensity 6300 6nm ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Google AI Glasses: డిస్ప్లే, వాయిస్ సపోర్ట్ తో.. రెండు AI గ్లాసెస్ ను విడుదల చేయనున్న గూగుల్

ఇందులో 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో కేవలం 28 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇక కెమెరా విభాగంలో.. వెనుక భాగాన 50MP మెయిన్ కెమెరా, ఒక సెకండరీ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరా నాచ్‌ లో అమర్చబడింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Xiaomi HyperOS 2తో నడుస్తుంది. వినియోగదారులకు 2 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు కూడా దీనికి లభిస్తాయి. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి.

IND vs SA: భారత జట్టులో అతడితోనే మాకు బిగ్ టెన్షన్: మార్‌క్రమ్

POCO C85 5G మిస్టిక్ పర్పుల్, స్ప్రింగ్ గ్రీన్ మరియు పవర్ బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఇక దీని ధరల విషయానికి వస్తే.. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.11,999, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,999, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.13,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 16వ తేదీ నుండి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇక లాంచ్ ఆఫర్ల కింద HDFC బ్యాంక్, ఐసీసీఐ బ్యాంక్, SBI కార్డులపై రూ.1000 తక్షణ తగ్గింపు లేదా ఎక్స్ఛేంజ్‌పై రూ.1000 తగ్గింపు పొందవచ్చు. అలాగే 3 నెలల పాటు నో కాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version