Poco C81 Pro: పోకో సి81 ప్రో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, యునిసోక్ టి7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్
- పోకో సి81 ప్రో
- 6000mAh బ్యాటరీ, యునిసోక్ టి7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్
- 4GB RAM + 128GB Storage వేరియంట్ ధర: €126 (సుమారు రూ.13,500)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Poco తన కొత్త Poco C81 Pro స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌ను కంపెనీ తొలిసారిగా 2026 ఏప్రిల్‌లో పరిచయం చేయగా, తాజాగా యూరప్‌లోని పలు దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పెద్ద డిస్ప్లే, శక్తివంతమైన బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపొందించారు.
Poco C81 Pro ధర
Poco C81 Pro ప్రస్తుతం జర్మనీ, స్పెయిన్ వంటి యూరోపియన్ మార్కెట్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. 4GB RAM + 128GB Storage వేరియంట్ ధర: €126 (సుమారు రూ.13,500) 4GB RAM + 256GB Storage వేరియంట్ ధర: €146.90 (సుమారు రూ.16,000). ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గ్రీన్, గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.
Also Read
- Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
- WhatsApp New Update: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. కొత్త ఫీచర్ వివరాలివే!
- Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!
- OnePlus Turbo 7 Pro 5G: 10,000mAh బ్యాటరీతో OnePlus కొత్త 5G ఫోన్.. 200MP కెమెరా, 100W ఛార్జింగ్!
డిస్ప్లే, ప్రాసెసర్
Poco C81 Proలో 6.9 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. ఇది 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ Unisoc T7250 Octa-Core Processorతో పనిచేస్తుంది. రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్‌కు కూడా మంచి పనితీరును అందిస్తుంది.
కెమెరా ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్లో 13MP ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా సెన్సార్, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు.
6000mAh బ్యాటరీ
Poco C81 Proలో ప్రధాన ఆకర్షణ 6000mAh భారీ బ్యాటరీ. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. కంపెనీ ప్రకారం, ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 79 గంటలకు పైగా మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
ఇతర ఫీచర్లు
ఈ ఫోన్లో Wet Touch Technology 2.0ను అందించారు. దీంతో తడి వేళ్లతో కూడా స్క్రీన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు. కనెక్టివిటీ ఫీచర్లు.. Bluetooth 5.2
Wi-Fi, GPS, GLONASS, Galileo ,NFC, USB Type-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, పరిమాణాలు, బరువు, పొడవు: 171.56mm, వెడల్పు: 79.47mm, మందం: 8.15mm, బరువు: 208 గ్రాములు. పెద్ద డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, ఆకర్షణీయమైన ధరతో Poco C81 Pro బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మంచి ఎంపికగా నిలవనుంది.
- Tags
- poco
- Poco C81 Pro
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్..? ఆ డీల్ కుదరాలంటే ఉన్న పెద్ద చిక్కు ఇదే..
-
PM Modi: ‘‘తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం’’ మన కల్చర్ కాదు.. మోడీ కీలక వ్యాఖ్యలు..
-
Fire Accident: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇంట్లో అగ్ని ప్రమాదం.. నిప్పు పెట్టిన దుండగులు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
-
Dawood Ibrahim: పాకిస్థాన్‌లో దావూద్ ఇంకా ఫుల్ యాక్టివ్.. మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ బయటపెట్టిన సంచలన నిజాలు
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!