ప్రస్తుతం అందరు డిజిటల్ పేమెంట్స్ ను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో ఒకటి ఫోన్ పే.. ఈ యాప్ ను ఎక్కువ మంది వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్లైన్లో మనీని ట్రాన్స్ఫర్ చెయ్యడం మాత్రమే కాదు.. లోన్ ను కూడా పొందవచ్చు.. తాజాగా మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది..Account Aggregator services సేవలను ప్రారంభించింది. ఇక ఈ కొత్త సేవ వినియోగదారులు తమ ఆర్థిక డేటాను, బ్యాంక్ వివరాల వంటి నియంత్రిత ఆర్థిక సంస్థలతో పంచుకోవడానికి అనుమతిస్తుంది.
బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, బీమా పాలసీలు, పన్ను ఫైలింగ్‌ల వంటి డేటాను ఆర్థిక సంస్థలతో పంచుకునే సమయంలో కస్టమర్లు కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు, కొత్త బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి లేదా పెట్టుబడి సలహాలను పొందడానికి సేవ సహాయం అందిస్తుంది..దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఫోన్ పే వ్యవస్థాపకుడు రాహుల్ చారి తెలిపారు..అకౌంట్ అగ్రిగేటర్ నెట్‌వర్క్‌తో, వ్యక్తులు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాల ప్రపంచాన్ని అన్‌లాక్ చేయడానికి వారి స్వంత సమాచారం శక్తిని ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు..
ఈ కొత్త సర్వీసుతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయంటే?
ఈ కొత్త సర్వీసుతో కస్టమర్స్ PhonePe వెబ్‌సైట్ లేదా PhonePe యాప్ నుంచి నేరుగా ఏదైనా కొనసాగుతున్న డేటాను అభ్యర్థించవచ్చు, పాజ్ చేయవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. ప్రారంభ ప్రక్రియలో భాగంగా, PhonePe యొక్క PTSPL YES బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్లతో ఒప్పందం చెయ్యబడింది..
ఇది ఇలా ఉండగా ఈ ఫోన్ పే గత ఏడాది లో Account Aggregator services అందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి పర్మిషన్స్ ను కూడా పొందింది..ఈ కొత్త ఫీచర్ PhonePe కస్టమర్స్ రిజిస్టర్ చేసుకోవడానికి, కొత్త ఇంటర్‌ఆపరబుల్ AA హ్యాండిల్‌ని సృష్టించడానికి అనుమతిస్తుంది..ఇక కస్టమర్లు PhonePe యాప్ హోమ్‌పేజీలో ‘చెక్ బ్యాలెన్స్’ ఎంపికపై వారి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను కూడా వెంటనే ప్రారంభించగలరు.. అత్యవసరం అయినవారు లోన్ ను ఇలా సులువుగా పొందవచ్చు..