Site icon NTV Telugu

క్రేజీ ఆఫర్.. 30W డాల్బీ ఆటమ్స్, 32GB స్టోరేజ్ PHILIPS 65 inch QLED Ultra HD (4K) Smart Google టీవీపై భారీ డిస్కౌంట్..!

Philips

Philips

PHILIPS 65 inch QLED Ultra HD (4K) Smart Google: ఫిలిప్స్ (PHILIPS) కంపెనీకి చెందిన QLED స్మార్ట్ టీవీలకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న ఆఫర్లలో భాగంగా ఫిలిప్స్ 55 అంగుళాల, 65 అంగుళాల స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా ఫిలిప్స్ 65 అంగుళాల QLED టీవీపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు.

7000mAh బ్యాటరీతో Oppo Reno 15C.. Snapdragon 6 Gen 1 చిప్‌+ ట్రిపుల్ రియర్ కెమెరా

ఈ టీవీలో 65 అంగుళాల QLED డిస్‌ప్లే ఉంది. ఇది అల్ట్రా HD 4K రిజల్యూషన్, 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. అలాగే డాల్బీ విజన్, HDR10+, HLG సపోర్ట్ కూడా ఉంది. వైడర్ కలర్ గామట్, ఆటో లౌ లాటెన్సీ మోడ్ (ALLM), 4K 120Hz హై స్పీడ్ రిఫ్రెష్, ఐ కేర్, MEMC వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అల్ట్రా నారో బెజెల్ డిజైన్ టీవీకి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

ఈ టీవీలో 30W సౌండ్ అవుట్‌పుట్ తో 2.0 చానల్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ ఆడియో, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్‌తో సినీమాటిక్ ఆడియో అనుభూతిని అందిస్తుంది. ఇది Google TV OSపై పనిచేస్తుంది. ఇందులో A55 చిప్‌సెట్, 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉన్నాయి. గూగుల్ టీవీ కారణంగా ఇన్-బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మిరక్యాస్ట్, గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఈ టీవీలో నెట్ఫ్లిక్, ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ , యూట్యూబ్ వంటి ప్రముఖ OTT యాప్స్ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తాయి. గ్రాఫిక్స్ కోసం Mali G52 MC1 GPU ఉపయోగించారు. డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్‌తో పాటు 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, AV పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, ఈథర్నెట్, హెడ్ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

భారీ డిస్కౌంట్‌తో Realme 14x 5G ఫోన్.. 6000mAh బ్యాటరీ+ 50MP కెమెరా..

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ప్రకారం.. ఈ Philips 65 inch QLED TV (PHILIPS 65PQT8100/94) అసలు ధర రూ.54,999పై 20% తగ్గింపుతో రూ.43,999కి లభిస్తోంది. అంతేకాదు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనంగా రూ.1,500 డిస్కౌంట్ అందుబాటులో ఉండటంతో ఈ టీవీని కేవలం రూ.42,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలో ఇన్ని ఫీచర్లతో Philips 65 అంగుళాల QLED Smart TV మంచి డీల్ అని చెప్పవచ్చు.

Exit mobile version