Panasonic: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రత్యేక ఆఫర్ కొనసాగుతోంది. ఈ ప్రత్యేక సేల్‌లో ప్రముఖ బ్రాండ్ పానాసోనిక్ 50 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ధర తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. నాణ్యమైన ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో కూడిన ఈ టీవీ ఇప్పుడు బడ్జెట్ ధరలో లభించడం వినియోగదారులకు మంచి అవకాశంగా మారింది. అయితే, పానాసోనిక్ 50 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 2025 మోడల్ గతంలో రూ.48,990 ధరకు విక్రయించగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో ఈ టీవీ ధరను తగ్గించి రూ.32,150కి అందిస్తున్నారు. ఇక, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా ఈఎంఐ విధానంలో కొనుగోలు చేస్తే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ టీవీని కేవలం రూ.30,650కే లభించనుంది.
Read Also: T20 World Cup 2026: వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. ఇక పాకిస్థాన్ వంతు?
ఫీచర్లు:
ఈ పానాసోనిక్ టీవీ అల్ట్రా హెచ్‌డీ 4K డిస్‌ప్లేతో వస్తుంది. 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ వంటి ఫీచర్లతో అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తాయి. అలాగే, 4K కలర్ ఇంజిన్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో అన్ని దిశల నుంచి స్పష్టమైన చిత్ర నాణ్యత లభిస్తుంది. ఈ టీవీ బెజెల్-లెస్ డిజైన్తో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. శక్తివంతమైన క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్ ఇందులో ఉండటంతో వేగవంతమైన పని తీరు అందుతుంది. అదనంగా 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
స్మార్ట్ కనెక్టివిటీ
ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్పై పని చేస్తుంది. దీంతో గూగుల్ ప్లే స్టోర్, క్రోమ్‌కాస్ట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లకు సపోర్టు చేస్తుంది. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, యూట్యూబ్ లాంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లు ముందుగానే ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. కనెక్టివిటీ పరంగా ఈ టీవీలో HDMI పోర్టులు, USB పోర్టులు, ల్యాన్ పోర్ట్, అలాగే ఆప్టికల్, RF సపోర్ట్ ఉన్నాయి. బిల్ట్-ఇన్ వై-ఫై, బ్లూటూత్, మొబైల్ కాస్టింగ్ వంటి వైర్‌లెస్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా జోడించారు.
Read Also: KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు..
ఆడియో & రిమోట్
పానాసోనిక్ 50 ఇంచుల టీవీలో 20W స్పీకర్లు, డాల్బీ డిజిటల్ సపోర్ట్, హోమ్ థియేటర్ తరహా ఆడియో అనుభూతిని అందిజేస్తుంది. పలు ఆడియో మోడ్‌లు ఉండటంతో సినిమాలు, సంగీతం, స్పోర్ట్స్‌కు తగినట్లుగా సౌండ్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఈ టీవీలో వాయిస్ కంట్రోల్ సపోర్ట్‌తో కూడిన స్మార్ట్ రిమోట్ కూడా వస్తుంది. ఇందులో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రత్యేక షార్ట్‌కట్ బటన్లు ఉండటం విశేషం. అయితే, అన్ని ఆధునిక ఫీచర్లు, నమ్మదగిన బ్రాండ్ విలువతో ఈ పానాసోనిక్ 50 ఇంచుల 4K స్మార్ట్ టీవీ ప్రస్తుతం సరసమైన ధరకి లభిస్తుంది. బడ్జెట్‌లో ప్రీమియం టీవీ కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది మంచి డీల్‌గా చెప్పొచ్చు.