Site icon NTV Telugu

IP68/69 రేటింగ్ సర్టిఫికేషన్స్, 50MP+50MP కెమెరా సెటప్ తో రాబోతున్న Oppo Reno 15c..

Oppo Reno 15c

Oppo Reno 15c

Oppo Reno 15c: ఓప్పో గత నెలలో చైనాలో రెనో 15, రెనో 15 ప్రో మోడళ్లను విడుదల చేసింది. ఇక ఇప్పుడు రెనో 15c డిసెంబర్‌లో మార్కెట్‌లోకి వస్తుందని సంస్థ ధృవీకరించింది. అధికారిక టీజర్లు ఇంకా రానప్పటికీ, తాజాగా ఈ మోడల్ చైనా టెలికాం డేటాబేస్‌లో కనిపించడంతో ముఖ్య ఫీచర్లు, స్టోరేజ్ వేరియంట్లు, అలాగే విడుదల తేదీ బయటపడ్డాయి. ఈ రెనో 15c మోడల్‌లో 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండబోతోందని సమాచారం. ఇది 1.5K రిజల్యూషన్ (2760 x 1256 పిక్సెల్స్) ను అందిస్తుందని, అలాగే ఇతర Reno 15 సిరీస్‌ల మాదిరిగా 120Hz రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండనుందని తెలుస్తోంది.

Vivo X300 Pro Price: లక్ష 10 వేల ఫోన్ రూ.3,167కే మీ సొంతం.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఇక డిజైన్ విషయానికి వస్తే.. ఫోన్ 158 x 74.83 x 7.77mm పరిమాణాలతో, సుమారు 197 గ్రాముల బరువుతో రాబోతోంది. అల్యూమినియం అలోయ్ ఫ్రేమ్‌తో పాటు IP68/69 రేటింగ్ సర్టిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇది నీరు, దుమ్ము నుండి మెరుగైన రక్షణ అందిస్తుంది. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వబడనుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా (Sony LYT-600 సెన్సార్), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ (IMX355 సెన్సార్), 50MP టెలిఫోటో కెమెరా (Samsung JN5 సెన్సార్) ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి. అలాగే సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడనుందని సమాచారం.

AI Chatbot: తస్మాత్ జాగ్రత్త.. ఏఐ చాట్‌బాట్లతో షేర్ చేయకూడని విషయాలేంటంటే..?

రెనో 15c Qualcomm Snapdragon 7 Gen 4 (SM7750) చిప్‌సెట్‌ ఉంటుందని లిస్టింగ్ వెల్లడిస్తోంది. ఇది 12GB RAMతో రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ColorOS 16 తో పనిచేస్తుంది. ఫోన్‌లో 6,500mAh భారీ బ్యాటరీ ఉండనుంది. దీని‌తో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించబడుతుంది. ఈ కేటగిరీ ఫోన్లలో ఇది మంచి పవర్ ప్యాకేజీగా చెప్పొచ్చు. చైనా టెలికాం లిస్టింగ్ ప్రకారం, Oppo Reno 15c అరోరా బ్లూ, కాలేజ్ బ్లూ, స్టార్లైట్ బో అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్ చైనాలో డిసెంబర్ 19 నుండి అమ్మకాలకు సిద్ధమవుతుందని సమాచారం.

Exit mobile version