Site icon NTV Telugu

OPPO Reno 15 Launch: ఒప్పో రెనో 15 సిరీస్ లాంచ్.. నాలుగు కొత్త మోడళ్లు, ధరలు, ఫీచర్లు ఇవే!

Oppo Reno 15 Launch

Oppo Reno 15 Launch

చైనా మొబైల్‌ తయారీ కంపెనీ ‘ఒప్పో’ అభిమానులకు గుడ్‌న్యూస్. ఒప్పో రెనో 15 సిరీస్ నేడు భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఒప్పో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఒకేసారి విడుదల చేస్తోంది. ఈ సిరీస్‌లో OPPO Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini, Reno 15c మోడళ్లు ఉన్నాయి. వీటిలో Reno 15 Pro Mini ఇప్పటివరకు చైనాలో లాంచ్ కాకపోవడం విశేషం. భారత్‌లో నేడు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఈవెంట్‌ను ఒప్పో అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్‌గా వీక్షించవచ్చు.

ప్రీమియం సెగ్మెంట్‌ లక్ష్యంగా ఒప్పో రెనో 15 సిరీస్ లాంచ్ అవుతోంది. ఒప్పో రెనో 15 5G (8జీబీ+256జీబీ) ప్రారంభ ధర రూ.45,999గా ఉండనుంది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.48,999గా.. 12GB/512GB వేరియంట్ రూ.53,999గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒప్పో రెనో 15 ప్రో 12జీబీ+256జీబీ ధర రూ.67,999గా.. 12జీబీ+512జీబీ ధర రూ.72,999కి లాంచ్ అవ్వనుంది. ఒప్పో రెనో ప్రో మినీ ప్రారంభ ధర సుమారు రూ.59,999గా ఉంటుందని అంచనా. ఒప్పో రెనో15c ధర ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు కానీ.. రూ.40,000 లోపే ఉండొచ్చని సమాచారం.

ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో రెనో 15 ప్రో మినీ మోడళ్లు మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌తో రావొచ్చని లీకులు చెబుతున్నాయి. ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15c మోడళ్లు క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌తో రానున్నాయి. ఈ సిరీస్‌లో డిస్‌ప్లే 6.32 ఇంచ్ నుంచి 6.78 ఇంచ్ వరకు ఉండనున్నాయి. మినీ మోడల్‌లో చిన్న స్క్రీన్ ఉండగా.. ప్రో వేరియంట్లు పెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉండే అవకాశం ఉంది. స్క్రీన్ రిజల్యూషన్, రిఫ్రెష్ రేట్, ప్యానెల్ టైప్ వంటి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 15 సిరీస్‌లోని అన్ని మోడళ్లలో 6,200mAh నుంచి 6,500mAh వరకు పెద్ద బ్యాటరీలు ఉండనున్నాయని సమాచారం. అన్ని ఫోన్లు 80W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇవ్వనున్నాయి.

Also Read: Ankush Bharadwaj: మైనర్ షూటర్‌పై లైంగిక దాడి.. కోచ్ అంకుష్ భరద్వాజ్‌పై పోక్సో కేసు!

ఒప్పో రెనో 15 ప్రో మోడళ్లు 200MP మెయిన్ రియర్ కెమెరాతో రానున్నాయి. అదనంగా రెండు 50MP సెన్సర్లు (అల్ట్రా-వైడ్ + టెలిఫోటో) ఉంటాయి. ఒప్పో రెనో 15 ఫోన్ 50MP ప్రైమరీ సెన్సర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండనుంది. పోర్ట్రెయిట్‌, ల్యాండ్‌స్కేప్‌, క్లోజ్-అప్ ఫోటోగ్రఫీకి ఈ కెమెరా సెటప్స్ అనువుగా రూపొందించబడ్డాయి. ఈ సిరీస్‌లోని అన్ని ఫోన్లు అల్యూమినియం ఫ్రేమ్, OPPO HoloFusion డిజైన్తో రానున్నాయని సమాచారం. అలాగే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌కు కూడా మద్దతు ఉంటుంది. కంపెనీ ఈ సిరీస్ ఫోన్‌లలో ఫోటోగ్రఫీ, బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రీమియం డిజైన్‌పై దృష్టి పెట్టింది.

Exit mobile version