Site icon NTV Telugu

OPPO Reno 15 Price: 200MP కెమెరా, 6,500mAh బ్యాటరీ.. మతిపోయే ఫీచర్లతో ఒప్పో రెనో 15 లాంచ్!

Oppo Reno 15 Price

Oppo Reno 15 Price

2026 సంవత్సరం ప్రారంభంలోనే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సందడి నెలకొంది. ప్రముఖ చైనా బ్రాండ్‌ ‘ఒప్పో’ తన తాజా రెనో 15 సిరీస్‌ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini అనే మూడు మోడల్స్‌ ఉన్నాయి. ఒప్పో కంపెనీ ఫోటోగ్రఫీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో శక్తివంతమైన ప్రాసెసర్‌, అమోలెడ్‌ డిస్‌ప్లేలు, భారీ ర్యామ్‌ ఆప్షన్లతో టెక్‌ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. రెనో సిరీస్‌లో కొత్తగా మినీ పేరిట కొత్త మోడల్‌ను ప్రకటించడం ఇదే మొదటిసారి.

ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో రెనో 15 ప్రో మినీ ఫోన్లు మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 8450 చిప్‌సెట్‌తో వచ్చాయి. వీటిలో 12GB వరకు ర్యామ్‌, 512GB వరకు ఇంటర్నల్‌ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇక స్టాండర్డ్‌ రెనో 15 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 4 ప్రాసెసర్ ఇచ్చారు. హైఎండ్‌ పనితీరు, మల్టీటాస్కింగ్‌ కోసం ఈ ఫోన్లు అనుకూలంగా ఉంటాయి. రెనో 15, రెనో 15 ప్రో మోడల్స్‌లో 6,500mAh బ్యాటరీ అందించారు. ఇక మినీలో 6,200mAh బ్యాటరీ ఉంది. భారీ బ్యాటరీ రోజంతా ఫోన్‌ వినియోగించుకునే వీలుంటుంది. 80W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉంది.

ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ కెమెరానే. రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మినీ మోడల్స్‌లో 200MP మెయిన్‌ కెమెరా (f/1.8 అపర్చర్) ఉంది. దీనికి తోడు 50MP టెలిఫోటో, 50MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌లు ఉన్నాయి. స్టాండర్డ్‌ 15లో 50MP వైడ్‌, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రా వైడ్‌ కెమెరా సెటప్‌ ఉంది. మూడు మోడల్స్‌లోనూ ఫ్రంట్‌ కెమెరాతో సహా 4K వీడియో రికార్డింగ్‌ (60fps) సపోర్ట్‌ ఉంటుంది. ముందువైపు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఐపీ 68+ ఐపీ 69 రేటింగ్‌తో వస్తున్నాయి. 15లో 6.59 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 1,200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్ ఉంది. ప్రో మినీ 6.39 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లే, 3,600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్ ఉండగా.. ప్రోలో 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్‌, 3,600 నిట్స్‌ బ్రైట్‌నెస్ ఉంది.

Also Read: Harry Brook Apology: క్షమాపణలు చెప్పిన హ్యారీ బ్రూక్.. భారీ ఫైన్ విధించి ఫైనల్‌ వార్నింగ్ ఇచ్చిన ఇంగ్లండ్!

ఈ సిరీస్‌ ఫోన్లలో కనెక్టివిటీ కోసం Bluetooth 5.4, NFC, భద్రత కోసం ఆప్టికల్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్ ఉన్నాయి. ఇవన్నీ Android 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తాయి. జనవరి 13 నుంచి Flipkart, Amazon, OPPO అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్స్ అమ్మకానికి రానున్నాయి. రెనో 15సీ మాత్రం ఫిబ్రవరిలో అందుబాటులోకి రానుంది. అత్యాధునిక కెమెరా ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్‌, బిగ్ బ్యాటరీలు, ఆకట్టుకునే డిస్‌ప్లేలు.. ఇలా అన్నీ కలిపి ఈ 15 సిరీస్‌ ఫోటోగ్రఫీ ప్రేమికులు, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ కోరుకునే వారికి మంచి ఎంపిక.

రెనో 15 ధరలు:
# Reno 15 (8GB + 256GB): RS 45,999
# Reno 15 (12GB + 256GB): RS 48,999
# Reno 15 (12GB + 512GB): RS 53,999
# Reno 15 Pro Mini (12GB + 256GB): RS 59,999
# Reno 15 Pro Mini (12GB + 512GB): RS 64,999
# Reno 15 Pro (12GB + 256GB): RS 67,999
# Reno 15 Pro (12GB + 512GB): RS 72,999

Exit mobile version