Site icon NTV Telugu

కొత్త వెల్వెట్ రెడ్ వేరియంట్ భారత్‌లో Oppo Find X9 అందుబాటులోకి.. ధర, ఫీచర్స్ ఇలా..!

Oppo Find X9 Velvet Red Variant

Oppo Find X9 Velvet Red Variant

Oppo Find X9: Oppo Find X9 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో కొత్త రంగులో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ గత నెల మొదట్లో స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే అనే రెండు రంగులలో విడుదల అయింది. తాజాగా కంపెనీ వెల్వెట్ రెడ్ (Velvet Red) కలర్ వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి మద్దతుగా గరిష్టంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వరకు లభిస్తుంది.

Shiva Ashtakam: సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు.. మీకోసం శివాష్టకం ఇదిగో..!

కెమెరా, బ్యాటరీ:
కెమెరా విషయానికి వస్తే Oppo Find X9 వెనుక భాగంలో Hasselblad ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో మూడు 50MP సెన్సార్లు, అదనంగా 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP షూటర్ అమర్చబడింది. ఈ ఫోన్ 7,025mAh సామర్థ్యం గల సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

కీలక స్పెసిఫికేషన్లు:
సాఫ్ట్‌వేర్ పరంగా Oppo Find X9 ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16.0 తో పనిచేస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59 అంగుళాల (1,256 x 2,760 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే ఉంది. దీనికి Corning Gorilla Glass 7i రక్షణ కల్పించారు. భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్ IP66, IP68, IP69 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కలిగి ఉంది. అలాగే అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసౌండ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

iBomma Ravi: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..!

ధర:
Oppo Find X9 కొత్త వెల్వెట్ రెడ్ వేరియంట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ స్మార్ట్ ఫోన్ రూ. 74,999 ధరగా నిర్ణయించబడింది. ఇది ఇతర రంగుల ధరతో పోల్చితే ఎటువంటి మార్పులు లేవు. ఈ కొత్త రంగు ఆప్షన్ డిసెంబర్ 8 నుండి ఒప్పో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అధీకృత రిటైల్ భాగస్వాముల ద్వారా భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్‌లను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు ఈ ఫోన్‌ను రూ. 67,499 తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version