ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- ఫైండ్ X10 ప్రో మ్యాక్స్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..
- 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్
- ట్రిపుల్ 200MP కెమెరా సెటప్
- 8,000mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- IP66, IP68, IP69 రేటింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Find X10 Pro Max: ఒప్పో (OPPO) నుండి ఫైండ్ X10 సిరీస్ లాంచ్ ఈవెంట్లో.. ఫైండ్ X10 ప్రో మ్యాక్స్ (OPPO Find X10 Pro Max)ను అధికారికంగా లాంచ్ చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే.. ఫైండ్ లైనప్‌లో “ప్రో మ్యాక్స్” విభాగానికి ఇది తొలి మోడల్. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా అధునాతన కెమెరా హార్డ్‌వేర్, కస్టమ్ కలర్-సైన్స్ ఇంటిగ్రేషన్, అధిక సామర్థ్యం గల బ్యాటరీ టెక్నాలజీ, తాజా ప్రాసెసింగ్ చిప్సెట్లపై దృష్టి పెట్టింది.
డిజైన్ & మన్నిక
ఫోన్ వెనుక భాగంలో హ్యాస్‌ల్‌బ్లాడ్ డిజైన్ అంశాలను ఉపయోగించారు. మెటాలిక్ ఫినిష్‌తో పాటు త్రీడీ వీవెన్ ప్యాటర్న్‌ను అందించారు. కెమెరా మాడ్యూల్ చుట్టూ సంప్రదాయ కెమెరా డయల్స్‌ను పోలిన డిజైన్ ఉంది. మూన్ వైట్, వార్మ్ ఆరెంజ్, లైట్ టైటానియం రంగుల్లో ఫోన్ లభిస్తుంది. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అలాగే SGS స్విట్జర్లాండ్ నుంచి 5 స్టార్ డ్రాప్ అండ్ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా ఈ ఫోన్ పొందింది.
Also Read
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ట్రిపుల్ 200MP సెటప్
ఈ ఫోన్లో అల్ట్రా-వైడ్, స్టాండర్డ్, టెలిఫోటో ఫోకల్ లెంగ్త్‌లలో నేటివ్ 200MP కెప్చర్ను అందించే సింక్రొనైజ్డ్ ట్రిపుల్ 200MP కెమెరా వ్యవస్థను ప్రవేశపెట్టారు.
* 200MP అల్ట్రా-వైడ్ యాంగిల్: 1/1.56-అంగుళాల సెన్సార్, f/2.2 అపెర్చర్‌తో, 124 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో పాటు 202% అధిక కాంతిని గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది.
* 200MP అల్ట్రా డైనమిక్ మెయిన్ సెన్సార్: f/1.5 అపెర్చర్‌తో ఒకే ఫ్రేమ్‌లో 17EV డైనమిక్ రేంజ్‌ను సాధిస్తుంది.
* 200MP టెలిఫోటో లెన్స్: వైడ్ టెలిఫోటో అపెర్చర్‌తో పాటు CIPA 7.5-గ్రేడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో జతచేయబడింది.
కొత్త LUMO కలర్ చాంబర్ ఈ ఇమేజ్ కెప్చర్కు తోడ్పడుతుంది. ఇందులో రెండో తరం డాన్షియా కలర్ రిప్రొడక్షన్ లెన్స్, LUMO నేటివ్ లైట్ అండ్ షాడో ఇంజిన్ ఉన్నాయి. సంక్లిష్టమైన లైటింగ్ పరిస్థితుల్లో కూడా రంగుల ఖచ్చితత్వం, టోనల్ ఫిడిలిటీని నిలబెట్టేలా వీటిని రూపొందించారు. అలాగే అన్ని ఫోకల్ లెంగ్త్‌లలో 8K లాగ్ రికార్డింగ్‌తో పాటు, డాల్బీ విజన్‌తో 120fps వద్ద 4K క్యాప్చర్‌ను సపోర్ట్ చేస్తుంది. హ్యాండ్‌హెల్డ్ వీడియోగ్రఫీ కోసం హార్డ్‌వేర్-లెవెల్ హారిజాన్ స్టెబిలైజేషన్ కూడా ఇందులో ఉంది.
ఈ కెమెరా ప్లాట్ఫామ్లో కొత్తగా DeepPix సెన్సార్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఇది ఫుల్-వెల్ కెపాసిటీని 60% పెంచడంతో పాటు, తక్కువ విద్యుత్ వినియోగంతో 16-బిట్ సింగిల్-ఫ్రేమ్ HDR అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ప్రొడక్షన్ వర్క్‌ఫ్లోల కోసం TILTA KHRONOS ఎకోసిస్టమ్‌తో ఇంటిగ్రేషన్‌తో పాటు, బ్లాక్‌మ్యాజిక్ కెమెరాతో లోతైన సాఫ్ట్వేర్ కంపాటిబిలిటీని కూడా OPPO ప్రకటించింది. దీనితో డాల్బీ విజన్, O-Log2, ఓపెన్ గేట్ షూటింగ్ మోడ్లకు నేటివ్ మద్దతు లభిస్తుంది.
హార్డ్‌వేర్, కనెక్టివిటీ
ఈ ఫోన్లో 2nm డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్ ఉంది. ఇది ColorOS 17పై పనిచేస్తుంది. వరుస 200MP షాట్ల మధ్య వ్యవధిని 0.7 సెకన్లకు తగ్గించేందుకు OPPO యొక్క తాజా టైడ్ ఇంజిన్ రిసోర్స్ షెడ్యూలింగ్‌ను ఉపయోగించుకుంటుంది. డిస్ప్లే విషయానికొస్తే.. 1 నిట్ వరకు డిమ్ చేయగల ఐ-ప్రొటెక్షన్ ప్యానెల్‌ను అమర్చారు. ఇది BT.2020 కలర్ గామట్లో 95% కవర్ చేస్తుంది. ఐదు-ఛానల్ యాంబియంట్ కలర్ టెంపరేచర్ సెన్సార్ నిజ సమయంలో పరిసర లైటింగ్‌ను ట్రాక్ చేస్తూ డిస్ప్లే అడ్జస్ట్మెంట్ను నిర్వహిస్తుంది. బ్యాటరీ విషయంలో 8,000mAh సామర్థ్యం గల సెల్‌ను అమర్చారు. కనెక్టివిటీ కోసం అప్డేటెడ్ శాన్హై కమ్యూనికేషన్ సూట్‌ను జోడించారు, ఇది ట్రై-నెట్వర్క్, ట్రై-స్టాండ్‌బై ఫంక్షనాలిటీతో 230కి పైగా దేశాలు, ప్రాంతాల్లో గ్లోబల్ నెట్వర్క్ కవరేజీని అందిస్తుంది.
స్పెసిఫికేషన్లు
* డిస్ప్లే: 6.78-అంగుళాల 1~120Hz LTPO AMOLED, 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్ నెస్, 3840Hz అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, HDR10+, డాల్బీ విజన్
* ప్రాసెసర్: ఆక్టా-కోర్ డైమెన్సిటీ 9600 ప్రో 2nm చిప్సెట్, Mali-G2-Ultra-NX GPUతో
* ర్యామ్/స్టోరేజీ: 12GB / 16GB LPDDR5X ర్యామ్‌తో 256GB / 512GB / 1TB UFS 4.1 స్టోరేజీ
* సాఫ్ట్వేర్: ColorOS 17తో ఆండ్రాయిడ్ 17
* కెమెరాలు: f/1.5 అపెర్చర్, OISతో 200MP మెయిన్ కెమెరా, 124° ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 200MP అల్ట్రా-వైడ్ కెమెరా, f/2.1 అపెర్చర్‌తో 200MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (OIS, టెలిఫోటో మాక్రో, 120x వరకు డిజిటల్ జూమ్, హాసెల్‌బ్లాడ్ పోర్ట్రెయిట్‌తో సహా)
* ఫ్రంట్ కెమెరా: f/2.0 అపెర్చర్‌తో 50MP, 4K 60fps డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్
* సెక్యూరిటీ: ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్
* నిరోధకత: దుమ్ము, నీటి నిరోధకత (IP66 + IP68 + IP69)
* ఆడియో: USB టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు
* కనెక్టివిటీ: 5G SA/NSA, వైఫై 7 (802.11be), బ్లూటూత్ 6.2, బీడూ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, QZSS, NavIC, NFC, USB టైప్-సి 3.2 జెన్ 1
* బ్యాటరీ: 80W సూపర్VOOC ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ చార్జింగ్‌తో 8000mAh (టిపికల్)
ధర
* 12GB+256GB – 6799 యువాన్ (సుమారు USD 1015 / రూ. 97,075).
* 12GB+512GB – 7499 యువాన్ (సుమారు USD 1120 / రూ. 1,07,070).
* 16GB+512GB – 7999 యువాన్ (సుమారు USD 1194 / రూ. 1,14,210).
* 16GB+1TB – 8999 యువాన్ (సుమారు USD 1344 / రూ. 1,28,490).
ప్రస్తుతం ఈ ఫోన్ ఆర్డర్ చేసుకునేందుకు అందుబాటులో ఉండగా.. సెప్టెంబర్ 24 నుంచి చైనాలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..