Site icon NTV Telugu

OnePlus Turbo కొత్త సిరీస్.. 16GB ర్యామ్, Android 16తో పాటు 9,000mAh బ్యాటరీ

Oneplus

Oneplus

OnePlus Turbo: త్వరలో చైనా మార్కెట్‌లో కొత్త OnePlus Turbo సిరీస్ ను విడుదల చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో ప్రధానంగా గేమింగ్‌పై దృష్టి సారించిన స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయని పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఫోన్లకు సంబంధించిన లాంచ్ తేదీ, ధర, పూర్తి స్పెసిఫికేషన్లను వన్‌ప్లస్ మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా OnePlus Turbo సిరీస్‌కు చెందిన ఒక మోడల్ బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించడం టెక్ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.

Read Also: Ather Electric Scooters: కొత్త ఏడాదిలో జేబుకు చిల్లు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల పెంపును ప్రకటించిన ఏథర్ ఎనర్జీ..

అయితే, OnePlus Turbo ఫోన్‌లో ఆక్టా-కోర్ ARMv8 చిప్‌సెట్ ఉండనుంది. ఇది క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ చిప్‌సెట్‌లో 3.21GHz క్లాక్ స్పీడ్‌తో ఒక ప్రైమ్ కోర్, మూడు పెర్ఫార్మెన్స్ కోర్లు, నాలుగు ఎఫిషియెన్సీ కోర్లు ఉండగా, గ్రాఫిక్స్ కోసం Adreno 825 GPUను అందించనున్నట్లు తెలుస్తుంది.

Read Also: 7,600mAh+ బ్యాటరీ.. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్.. iQOO Z11 Turbo ఫోన్‌లో ఫీచర్స్ అదుర్స్!

ఇక, లిస్టింగ్‌లో ఫోన్‌కు 14.81GB ర్యామ్ చూపించగా, ఇది వాణిజ్యంగా 16GB ర్యామ్ గా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేయనున్నట్లు తెలుస్తోంది. లాంచ్ టైమ్‌లైన్ విషయానికి వస్తే, OnePlus Turbo ఫోన్‌ను వచ్చే ఏడాది జనవరిలో చైనా మార్కెట్‌లో రిలీజ్ చేయవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లి జీ లూయిస్ ఇటీవల వీబో వేదికగా మాట్లాడుతూ.. OnePlus Turbo సిరీస్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని అధికారికంగా ధృవీకరించారు. ఈ కొత్త సిరీస్‌ను వన్‌ప్లస్ 12వ వార్షికోత్సవ వేడుకల్లో కూడా ప్రస్తావించారు. ఈ లైనప్ పూర్తిగా గేమింగ్ యూజర్లను లక్ష్యంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

కాగా, ఇప్పటి వరకు వచ్చిన లీక్‌ల ప్రకారం, OnePlus Turbo ఫోన్‌ను OnePlus Ace 6 Turbo పేరుతో కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 9,000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల LTPS OLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, అలాగే 144Hz లేదా 165Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ అన్ని వివరాలను పరిగణనలోకి తీసుకుంటే, OnePlus Turbo సిరీస్ గేమింగ్ ప్రియులకు అనుకూలంగా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశం ఉంది. ఫోన్ లాంచ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం వినియోగదారులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Exit mobile version