OnePlus Nord 5 or Poco X7: బడ్జెట్ ఫ్రెండ్లీ బీస్ట్ లేదా ఫీచర్ ప్యాక్డ్ ప్రో.. ఏ మొబైల్ బెస్ట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Nord 5 or Poco X7: మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రస్తుతం చాలా కాంపిటేషన్ గా మారింది. ఈ పోటీలో అత్యంత పేరుగాంచిన రెండు మోడళ్లు OnePlus Nord 5, Poco X7 స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు మొబైల్స్ ఆకట్టుకునే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వచ్చాయి. మరి వినియోగదారులకు ఏ మొబైల్ సరిపోతుంది? ఎందుకు అని చూద్దాం..
డిజైన్, డిస్‌ప్లే:
OnePlus Nord 5 లో 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. అలాగే ఇందులో Gorilla Glass 7i ప్రొటెక్షన్, IP65 రేటింగ్ కూడా ఉంది. ఇక Poco X7 6.67 అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగింది ఉంది. దీన్ని బట్టి చూస్తే.. డిస్‌ప్లే పరంగా Nord 5 స్మూత్ అండ్ బ్రైట్ అనుభవం ఇస్తుంది.
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ప్రాసెసర్:
ముందుగా Nord 5లో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంది. దీని వల్ల గేమింగ్, హెవీ యూజ్‌లో ఇది బాగా పనిచేస్తుంది. మరోవైపు Poco X7 మొబైల్ MediaTek Dimensity 8400 అల్ట్రా చిప్‌సెట్ కలిగి ఉంది. అలాగే బెంచ్‌మార్క్స్‌లో ఇది చాలా విభాగాలలో ముందు ఉంది. మొత్తంగా పనితీరు పరంగా Poco X7 కాస్త ముందుంది.
కెమెరా సెటప్:
Poco X7 మొబైల్ లో 50MP IMX882 ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్, 20MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మరోవైపు Nord 5 మొబైల్ లో 50MP Sony OIS LYT-700 ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్, 50MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. కాబట్టి బ్యాక్ కెమెరాగా రెండు ఒకటే అయినా.. సెల్ఫీల కోసం Nord 5 బెస్ట్.
బ్యాటరీ & ఛార్జింగ్:
Poco X7 మొబైల్ లో 6000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి. అలాగే Nord 5 మొబైల్ లో 6800mAh భారీ బ్యాటరీ, 80W SUPERVOOC, రివర్స్ ఛార్జింగ్. 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్. దీన్ని బట్టి చూస్తే.. ఛార్జింగ్ స్పీడ్‌లో Poco X7, బ్యాకప్‌లో Nord 5 బెస్ట్.
సాఫ్ట్‌వేర్ & అప్‌డేట్స్:
Nord 5 మొబైల్ లో OxygenOS 15 (Android 15), Google Gemini AI, Plus Key. 4 సంవత్సరాల మెజర్ అప్‌డేట్స్ ఉంటాయి. ఇక Poco X7 మొబైల్ లో HyperOS 2 (Android 14), 3 సంవత్సరాల అప్‌డేట్స్ ఉన్నాయి. దీన్ని గమనిస్తే.. సాఫ్ట్‌వేర్ సపోర్ట్ అండ్ లాంగ్-టర్మ్ అప్‌డేట్స్‌లో Nord 5 ముందుంది.
రుచిగా అనిపించినా జంక్ ఫుడ్ కి బానిసైతే..ఆరోగ్యానికి శత్రువే!
ధరలు:
Nord 5 మొబైల్ రూ.31,999 నుంచి మొదలుతుండగా.. Poco X7 మొబైల్ రూ.25,990 నుంచి మొదలవుతుంది. కాబట్టి తక్కువ ధరలో పనితీరు కావాలంటే Poco X7, కానీ ప్రీమియం అనుభవం, ఫీచర్లు కావాలంటే Nord 5 బెస్ట్.
ఏది కొనాలి?
బెటర్ డిస్ప్లే, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మంచి సెల్ఫీలు కావాలంటే OnePlus Nord 5 ఎంచుకోవచ్చు. అదే ఫాస్ట్ ఛార్జింగ్, తక్కువ ధరలో మొబైల్ మంచి పనితీరు కావాలంటే Poco X7 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఈ రెండు మొబైల్స్ లో ఎంపిక మీ బడ్జెట్, అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!