జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, హార్ట్ వ్యాధులు, డయాబెటిస్, హై బీపీ, జీర్ణ సమస్యలు, లివర్ ఇబ్బందులు, మెదడు పనితీరు తగ్గిపోవడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, చర్మ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల వీటిని తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి

ఎక్కువగా ఆయిల్, కొవ్వు పదార్థాలు ఉండటంతో బరువు త్వరగా పెరుగుతుంది.

అధిక కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్స్ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది

ఎక్కువగా చక్కెర, కార్బోహైడ్రేట్స్ ఉండటంతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటిస్ వస్తుంది

ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం, జీర్ణకోశ సమస్యలు వస్తాయి

పోషకాలు లేకపోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది

జంక్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది

విటమిన్లు, మినరల్స్ లేని ఆహారం తినడం వల్ల శరీర రక్షణ శక్తి తగ్గుతుంది

ఎక్కువ ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్ తినడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది

పింపుల్స్, మొటిమలు, చర్మంలో ఆయిల్ ఎక్కువ అవడం వంటి సమస్యలు వస్తాయి

జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అలసట, ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది