NTV Telugu Site icon

OnePlus Ace 3: వన్‌ప్లస్‌ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్స్.. ధర ఎంతంటే?

Oneplus (2)

Oneplus (2)

ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఐఫోన్ తో పోటి పడుతూ ఆకర్షణీయమైన ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తుంది.. మెటల్‌ ఫ్రేమ్‌ డిజైన్‌తో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఎక్కడ ప్రకటించలేదు.. కానీ ఆన్లైన్లో ఈ ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఫీచర్స్ విషయానికొస్తే.. ఏస్‌3 ఫోన్‌లో 1.5కే రిజల్యూషన్‌తో కూడిన కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ చేయనుంది. ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రానుందని తెలుస్తుంది.. సెన్సార్ ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది..

ఇక కెమెరా విషయానికొస్తే.. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనన్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌, 8 మెగాపిక్సెల్‌, 32 మెగాపిక్సెల్ కెమెరాలను ఇవ్వనున్నారు. ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో ఫ్రంట్ కెమెరాను అందించారు.. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ అనే ఫీచర్‌ను కెమెరాలో ప్రత్యేకంగా అందించారు. ఇక ఈ ఫోన్‌లో 100 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.. ధర ఎంతనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు.. ఇంకా ఎన్నో ఫీచర్స్ తో ఈ ఫోన్ త్వరలోనే భారత్ మార్కెట్ లో లాంచ్ కానుందని సమాచారం..